ఏపీ ఎన్జీవోల సభ రెచ్చగొట్టే చర్య : కేకే

హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీవోలు సభ పెట్టడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే చర్య అని టీఆర్‌ఎస్ నేత కె. కేశవరావు పేర్కొన్నారు. జానారెడ్డితో భేటీ ముగిసిన అనంతరం కేకే మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసే బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. రెండు ప్రాంతాల ఉద్యోగుల మధ్య విద్వేషాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.