ఏది లెఫ్టిజం.. ఏది రైటిజం

ఏ.. నేను కమ్యూనిస్టును గా రైటిస్టుతోటి కలుస్తనా..? ఏ నేను రైటిస్టును గా లెఫ్టిస్టుతోటి కలుస్తనా? ఇవి బీసీ, ఎస్సీ, ఎస్టీల మాటలు.. మరి  మన లెఫ్టిస్టు.. రైటిస్టులకు నాయకత్వం వహిస్తున్న కమ్మవర్ణానికి  ఇవేం పట్టింపుల్లేవు.. సమైక్య తురాణాం.. న లెఫ్టిస్టు.. న రైటిస్టు..  జబ్బలు జబ్బలు తాకిచ్చుకుని తిరుక్కుంట తమ ఎజెండాను అమలు చేస్తున్నరు. మొన్నటిదాకా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు, రాజ్యసభలో వెంకయ్యనాయుడు చేసిన అఖిలపక్ష ప్రతిపాదనను ఇవాళ సీపీఐ నారాయణ షిండే ముందుంచిండు. అఖిలపక్ష భేటీ పెట్టి ఇరుప్రాంతాల వాదనలు వినాలని చెప్పిండు. రాఘవులు కూడా ఇదే చెప్తున్నడు. ఈ విషయంలో వీళ్లంతా ఏకతాటిపై ఉన్నరు. చంద్రబాబు పార్టీని బతికించడానికి బీజేపీని సీమాంధ్రలో నామరూపంలేకుండా చేసిన నేత వెంకయ్యనాయుడైతే.. బాబును అధికారంలోకి తీసుకురావడానికి పొత్తులు పెట్టుకుని సీట్లన్నీ టీడీపీకి అప్పగించి ఓట్లు వేయించే పార్టీలు సీపీఐ, సీపీఎంలు.  ఈ నేతలంతా కార్యకర్తలకు చెప్పేవి శ్రీరంగ నీతులు.. దూరేవి కమ్మ కొంపలు..

పార్టీలేవైనా, సిద్ధాంతాలేవైనా వాళ్ల అంతర్గత ఎజెండా వేరే ఉంటది.. అదీ వాళ్ల నీతి.. రీతి..  చిన్న కేడర్ అయిన మనోళ్లు మాత్రం సొంత అన్న లెఫ్టిస్టు అయితే రైటిస్టు తమ్ముడు మీద కన్నెర్ర చేస్తడు.. సొంత తమ్ముడు రైటిస్టు అయితే అన్న లెఫ్టిస్టు కయ్యానికి కాలుదువ్వుతడు.  నయవంచకుల నాయకత్వంలో  ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఆగమవుతున్నరు. ఆవేశపడుతున్నరు.

కొందరు అన్నలకు కోపం రావొచ్చు..  కానీ ఇది నిజమో కాదో గుండెల మీద చెయ్యేసుకుని ఆలోచించండి.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.