ఏం బాబు.. ఏమంటివి.. ఏమంటివి?

బాబు.. ఏమంటివి  ! ఏమంటివి!
ఇది ప్రెస్ మీట్ వ్యవహారమే కానీ అవినీతి వ్యవహారం కాదే
కాదు.. కాకూడదు.. ఇది అవినీతి వ్యవహారమే అందువా?
నీ తోక పత్రికలు ఆంధ్రజ్యోతి, ఈనాడు, చానళ్లు సీవీఆర్, స్టూడియో ఎన్ జననమేట్టిది?
అతి జుగుప్సాకరమయిన నీ హెరిటేజ్ మనుగడ ఎట్టిది?

పార్టీ ఫండ్ పేరిట కోట్లు వసూలు చేస్తివే..
సీబీఐ ఎంక్వైరీ తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుతుంటివే నీది ఏ నీతి?

నీ పార్టీ చెత్త కుప్పలో పడ్డనూ కోటాను కోట్లు గడించుచుంటివే.. నీది కాదా అవినీతి?

నాతో చెప్పింతురేమయ్యా! నీ మామను వెన్నుపోటు పొడవ లేదా..? అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను నీవైపు మలుపుకోలేదా?

పంజాగుట్టలో 20కోట్ల విలువైన భవనం.. తమిళనాడులో 50కోట్ల విలువైన గిడ్డంగి, రంగారెడ్డి జిల్లా మదీన125 కోట్ల స్థలం.. హెరిటేజ్ లో 73 కోట్ల పెట్టుబడి,  హెరిటేజ్ అగ్రో మెరైన్, ఫిన్ లీజ్ షేర్లు, హెరిటేజ్ ఫుడ్స్ రిటేల్, కాన్ ఫ్రా ఎక్కడి నుంచి వచ్చినవి.. నీ కొడుకు లోకేష్ కు జూబ్లీహిల్స్ లో 13 కోట్ల భవంతి, కర్నాటక యమారా లో 15 కోట్ల విలువైన 3రంగారెడ్డి జిల్లా మదీన గూడలో 125 కోట్ల విలువైన 5 ఎకరాల భూమి, మహారాష్ట్ర రాయ గడ్ జిల్లా సోగాంలో 80 కోట్ల విలువైన 8.426 ఎకరాల హూమి,  హెరిటేజ్ ఫుడ్స్ లో 3265 కోట్ల పెట్టుబడి, నీ కోడలు బ్రాహ్మణికి చెన్నై టెంపుల్ సిటీలో 100 కోట్ల విలున స్థలం  అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్ము కాదా?

ఆకాశమే హద్దుగా సంపాదించి.. జనం సొమ్ము దిగమింగిన నువ్వు ఏనాడో అవినీతి సామ్రాట్ గా పేరు తెచ్చుకున్నావు.

కాగా నేడు అవినీతి అవినీతి అని వ్యర్ధ వాదములెందులకు?

ఇంకేమంటివి బాబు
తెలంగాణ మీడియాకు విలువలు లేవందువా?
ఎంత  మాట !!!! ఎంత  మాట !!!!
డిసెంబర్ 10న అర్ధరాత్రి తెలంగాణ ఎట్ల ఇస్తరని మెలికపెట్టి..
రాజీనామా డ్రామాలతో తెలంగాణను అడ్డుకున్నది నీవు కాదా?
రెండు కళ్ల సిద్ధాంతంతో తెలంగాణ విద్యార్థుల ఆత్మహత్యలను కారణమైన..
నీ బండారం భయటపెడితే తెలంగాణ మీడియాకు విలువలు లేవందువా?

తెలంగాణ ప్రజల మనోభావాలను నిత్యం గాయపరుస్తూ..
నీతిరీతిలేని సమైక్యవాద ఉద్యమాన్ని మోస్తున్నది టీడీపీ కాదా?.
నీ అవినీతి సొమ్ముపై సీబీై విచారణ జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి లొంగిపోయిన..  టీడీపీ ఏనాడో విలువలు కోల్పోంది.
మామను వెన్నుపోటు పొడిచిన నీచాతినీచమైన నీ చరిత్ర ఏనాడో అప్రదిష్ట  మూట కట్టుకున్నది.
మీరు నేడు అవినీతి, విలువలంటూ మాట్లాడుట

!!!!! ఎంత అవివేకము !!!!!
!!!!! ఎంత అజ్ఞానము !!!!!!
!!!!! ఎంత కుసంస్కారము !!!!!
తెలంగాణకు మోసం చేసిన టీడీపీని ప్రజలు  కూకటి వేళ్ళతో  పెకలించి వేసెదరునీ చుట్టూ ఉన్న టీడీపీ ఫోరం నేతలు ఓట్లకెళ్తే ప్రజలు తరిమితరిమి కొడుతున్నప్పుడు  బాబు చేసింది తప్పే.. పచ్చపార్టీని వీడుతామంటూ నీ నేతలు హాహాకారాలు చేసెదరు.
తెలంగాణకు ఒప్పుకోకుండా సమైక్యవాదాన్ని వినిపించడమేకాక..
తెలంగాణ మీడియాను కించపరుస్తున్న నిన్ను, నీ పార్టీని..
వచ్చే ఎన్నికల్లో వంద అడుగుల లోతున బొందపెట్టెందుకు సిద్ధమగుచుంటిరి
సర్వదా శతాధ సిఖదా సహస్రత  పాప  పక్కిలమైన  నీ పార్టీని  ప్రజలు సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన  గావించెదరు !!!

Any Doubts……….ః

 

This entry was posted in CRIME NEWS.

Comments are closed.