ఎవని ‘పంచాయితీ’ వానిదే!

ఒకడు టీడీపీకి 2వేల సీట్లంటడు.. ఇంకో టీవోడు 18 వందలంటడు.. టీవీ9వాడు టీఆర్ఎస్ కు వంద స్థానాలే అంటడు.. టీఆర్ఎస్ కు సీమాంధ్ర  జిల్లాలో ఈటీవీ వాడు సున్నా వేస్తడు..  ఇట్ల తొలివిడత ఎన్నికల రోజు 23 తారీఖున సీమాంధ్ర చానళ్లు గబ్బు లేపినయ్. వీళ్ల లెక్కప్రకారం ఏపీ కాకుండా పక్క రాష్ట్రాల పంచాయితీలు కూడా కలిసుంటయి.

టీడీపీ ప్రభంజనం అని ఈటీవీ, ఏబీఎన్ డబ్బా కొడితే.. వైఎస్సార్సీపీదే విజయమంటూ సాక్షి అరిచిగీపెట్టింది.

పంచాయతీ సమరంలో భాగంగా మంగళవారం 5790 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఆయా పార్టీలకు సానుకూలంగా ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా తాము మద్దతు ఇచ్చే పార్టీలనే తోపులుగా చూపించే ప్రయత్నం చేసినయి. కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నదని కొన్నింటిలో వార్తలు వస్తే, తెలుగుదేశం పార్టీనే హీరో అయ్యిందని మరో మీడియా, లేదు లేదు, వైఎస్సార్సీపీనే ఎక్కువ స్థానాలు సాధించి పాలక, ప్రతిపక్షాలను దెబ్బకొట్టిందంటూ ఇంకో మీడియా.. ఇలా ఎవరికివారు తాము మెచ్చే, జైకొట్టే పార్టీలకు ఎక్కువ సీట్లు చూపించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఈటీవీ, సాక్షి, ఏబీఎన్‌తోపాటు ఐ న్యూస్, జీ 24 గంటలు ఒక్కో రకంగా ప్రచారం కొనసాగించాయి. ఈ చానెళ్లు టీఆర్ఎస్ కు వచ్చిన స్థానాలను కూడా చాలా సేపు 100 గానే చూపించినయి. కేవలం సిద్ధిపేటలోనే టీఆర్ఎస్ 70 సీట్లను గెలుచుకుంది. అయినా ఈ చానళ్లు తప్పుడు ప్రసారాలను మానలేదు.

 

This entry was posted in MEDIA MUCHATLU, Top Stories.

Comments are closed.