ఎవడు మతతత్వవాది? ఎవడు కాదు?

ఇంతకీ ఎవడు మతతత్వవాది? ఎవడు కాదు?
నిజంగా సెక్యూలరిస్టులంటే..
ఏ మతానికి చెందని వారా? అన్ని మతాలను సమంగా చూసేవారా?
లేక ఒక వ్యక్తికి, ఓ ఘటనకు ముడిపెట్టి.. ఓ మతాన్నే విమర్శించేవాళ్లా ?
అదే నిజమైతే.. ఏదో ఒక జమానాలోనో.. ఘటనలోనో..
నరమేధం సృష్టించని జాతేది? మతమేది?
అందరూ ఆ తానులో ముక్కలేగా..
ఇంకెందుకు గొంగట్లో తింటూ వెంట్రుకలేరడం?

సెక్యులరిస్టు తొడుగు తొడుక్కున్న మతోన్మాదుల్లారా..
మసీదుల్లో..ప్రార్థనలు..,
ఆలయాల్లో బైబిల్‌ సూక్తులు..,
చర్చిల్లో నమాజు.. చదివే విధానాన్ని స్వాగతించగలరా?

-అజయ్

This entry was posted in POEMS.

Comments are closed.