–
సమస్యలపై ప్రశ్నించిన ఓ విద్యార్థిపై మెదక్ జిల్లా దుబ్బాక ఎమ్మె ల్యే ముత్యండ్డి గూండాగిరి ప్రదర్శించారు. ఆయన విద్యార్థి కాలర్ పట్టుకుంటే అనుచరులు దాడి చేశారు. బుధవారం నియోజకవర్గంలోని కళాశాలలను పరిశీలించడానికి ఇంటర్‌బోర్డు కమిషనర్ జేఎస్వీ ప్రసాద్‌తోపాటు ఎమ్మెల్యే వచ్చారు. దుబ్బాకలో ప్రభుత్వ ఇంటర్ కళాశాలలోనే డిగ్రీ కళాశాల షిఫ్టింగ్ పద్ధతిలో కొనసాగుతోంది. డిగ్రీ కళాశాలను మరోచోటికి మా ర్చాలని కమిషనర్, ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. షిఫ్టింగ్‌తో ఇప్పటికే ఇబ్బందులున్నాయని, తరలించవద్దని విద్యార్థులు కోరారు. దీంతో ముత్యండ్డి ‘చదవండి, చదవకపోండి. నా కోసం చదువుతున్నా రా’ అని వ్యంగ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడ టంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోపోవూదిక్తుడైన ఎమ్మెల్యే, డిగ్రీ విద్యార్థి బాల్‌రాజు గల్లా పట్టుకోగా, అనుచరులు దాడి చేశారు. దీనికి నిరసనగా గురువా రం దుబ్బాక బంద్, విద్యాసంస్థల బంద్‌కు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగాడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ పిలుపునిచ్చారు.