ఎమ్మార్ ఎంజీఎఫ్‌పై ఈడీ కొరడా రూ.8,600 కోట్ల ఫైన్

Emaar
సంస్థపై విదేశీ మారక నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు
-స్థిరాస్తి రంగంలో ఇదే అతిపెద్ద జరిమానా
– పెనాల్టీ మొత్తం రూ.25 వేల కోట్లకు పెరిగే అవకాశం
ఆది నుంచి వివాదాలకు నిలయమైన ఎమ్మార్ సంస్థపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.8,600 కోట్ల భారీ జరిమానా విధించింది. నిర్మాణ ప్రాజెక్టులు చేపడతామంటూ విదేశాల్లోని అనుబంధ సంస్థల ద్వారా వేల కోట్ల డబ్బు కుమ్మరించిన సంస్థ.. ఆ నిధులతో ఇక్కడ వ్యవసాయ భూములను కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. విలాసవంత గృహ సముదాయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, ఆఫీసు భవన నిర్మాణాలు చేపట్టాలన్న ఉద్దేశంతో మనదేశంలోని ఎంజీఎఫ్‌తో 2005లో జతకట్టిన ఎమ్మార్ ప్రాపర్టీస్.. నిధులను పక్కదారి పట్టించడం ద్వారా ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యా క్ట్(ఫెమా) నిబంధనలను ఉల్లంఘించింది. మున్ముందు సంస్థపై విధించిన పెనాల్టీ మొత్తం రూ.25 వేల కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది.

విదేశీ మారక నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను నిర్మాణ రంగ సంస్థ ఎమ్మార్ ఎంజీఎఫ్‌తో పాటు దాని అనుబంధ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రూ.8,600 కోట్ల భారీ జరిమానా విధించింది. స్థిరాస్తి రంగంలో ఇప్పటి వరకు ఇదే అదిపెద్ద జరిమానా. దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్‌డీఐ)ల రూపంలో నిధులను చొప్పించే విషయంలో సంస్థ ఫారిన్ ఎక్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) నిబంధనలను అతిక్షికమించినట్లు దర్యాప్తులో తేలిందని ఈడీ వెల్లడించింది. ఈ కేసును 2010 నుంచి ఈడీ దర్యాప్తు చేస్తున్నది. నిర్మాణ రంగ ప్రాజెక్టుల అభివృద్ధి కోసం పెట్టుబడులు పెడుతున్నట్లు ఆర్‌బీఐకి సమాచారం అందించిన సంస్థ నిధులను వ్యవసాయ భూములను కొనుగోలు చేసేందుకు ఉపయోగించిందని, ఇది బ్యాంకింగ్, ఎఫ్‌డీఐల నియంవూతణ మండలి ఆర్‌బీఐ నియమావళికి విరుద్ధమని ఈడీ పేర్కొంది.

దుబాయ్‌కి చెందిన ఎమ్మార్ ప్రాపర్టీస్, దేశీయ ఎంజీఎఫ్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌ల భాగస్వామ్య సంస్థే ఎమ్మార్ ఎంజీఎఫ్. దుబాయ్, సైప్రస్, మారిషస్ ఇంకా మరో దేశంలోని నాలుగు అనుబంధ సంస్థల నుంచి ఎమ్మార్ ఎంజీఎఫ్‌కు ఏప్రిల్ 2005 నుంచి ఎఫ్‌డీఐల రూపంలో రూ.8,600 కోట్ల మేర నిధులు అందాయని తెలిపింది. ప్రస్తుతం సంస్థలోకి వచ్చిన పెట్టుబడులకు సమానమైన జరిమానా విధించిన ఈడీ.. మున్ముందు ఈ మొత్తాన్ని రూ.25 వేల కోట్ల వరకు( పెట్టుబడిపై 300 శాతం) పెంచొచ్చని సమాచారం. ఈ విషయంపై సంస్థ స్పందిస్తూ.. జరిమానా నోటీసులు ఇంకా తమకందలేదని, అందుచేత ఇప్పుడే ఏం చెప్పలేమని పేర్కొంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.