ఎన్సీటీసీ వద్దేవద్దు!

న్యూఢిల్లీ: జాతీయ ఉగ్రవాద నిరోధక కేంద్రం (ఎన్సీటీసీ) ఏర్పాటును ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంవూతులు ముక్తకం వ్యతిరేకించారు. దీని ఏర్పాటు దేశ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తంచేశారు. దేశ భద్రతకు నక్సలిజం పెనుముప్పుగా మారిందనే విషయాన్ని అంగీకరిస్తూనే.. దాని అణచివేతకు ఎన్సీటీసీ ఏర్పాటు సమాధానం కాదని స్పష్టం చేశారు. బుధవారం ప్రధాని అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అంతర్గత భద్రత వార్షిక సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంవూతులు వ్యక్తం చేసిన అభివూపాయలివి..
ఎన్సీటీసీ నాసిరకం ఆలోచన: మోడీ
‘‘ఎన్సీటీసీ ఏర్పాటు అనేది ఒక నాసిరకమైన ఆలోచన. ఇది పాతకాలపు విధానం. ఇది ఎలా పనిచేస్తుంది. దీనిలో ఉండే బలగాలు ఏమిటి. ఏ స్థాయిలో ఉండనుంది. దీనికి ఎక్కడి నుంచి అధికారాలు వస్తాయి అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. దీని వల్ల దేశ భద్రత వ్యవస్థకు నష్టం చేకూరడం తప్ప.. అది బలోపేతం కాదు’’ అని గుజరాత్ సీఎం మోడీ పేర్కొన్నారు. చివరి నిమిషంలో ప్రతిపాదిత ఎన్సీటీసీ ముసాయిదాను తమకు ఇవ్వడంపై ఆందోళన వ్యక్తంచేశారు.

సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తుంది: ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్
‘ప్రస్తుత రూపంలోని ప్రతిపాదిత ఎన్సీటీసీని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది మన రాజ్యాంగం ప్రబోధించిన సమాఖ్య విధానాన్ని దెబ్బతీస్తోంది. రాజ్యాంగ పరిధిలో ఎన్సీటీసీని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం’ అని ఛత్తీస్‌గఢ్ సీఎం రమణ్‌సింగ్ అన్నారు. ‘తాజాగా సమీక్షించిన ఎన్సీటీసీ ముసాయిదాలోనూ తీవ్ర లోపాలు ఉన్నాయి. అనాగరిక నిబంధనలు ఉన్నాయి. కేంద్ర ఉగ్రవాద నిరోధక ఏజెన్సీ ఏర్పాటుకు పార్లమెంటులో చర్చ చేపట్టి.. విస్తృత ఆమోదం పొందాలి. వామపక్ష తీవ్రవాదం అణచివేతకు అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికలో మార్పులు తేవాలి’ అని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. కాగా, ఎన్సీటీసీ విషయంలో కేంద్రం తమను విరోధులుగా చూస్తోందని తమిళనాడు సీఎం జయలలిత మండిపడ్డారు. ఉగ్రవాదంపై పోరులో కేంద్ర, రాష్ట్రాలకు సమాన పాత్ర ఉండాలని సూచించారు. దేశ సమాఖ్య విధానానికి ప్రతిపాదిత ఎన్సీటీసీ సరిపడపోదని బెంగాల్ సీఎం మమత పేర్కొన్నారు. ‘రాజ్యాంగం నిర్దేశించిన సమాఖ్య విధానం పరిధిలో ఎన్సీటీసీ ఏర్పాటు కావాలని మేము కోరుకుంటున్నామ’ని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు.

దేశం తీవ్ర మూల్యం చెల్లించుకుంటుంది: చిదంబరం
ఎన్సీటీసీ ఏర్పాటు నాసికరమన్న గుజరాత్ సీఎం మోడీ వ్యాఖ్యలను కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం తోసిపుచ్చారు.ఎన్సీటీసీ ఏర్పాటు చేయకపోతే.. దేశం తీవ్ర మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన హెచ్చరించారు. ఎన్సీటీసీ ఏర్పాటుపై పలు రాష్ట్రాల సీఎంలు అభ్యంతరాలు వ్యక్తంచేయడంపై ఆయన విచారం వ్యక్తంచేశారు.తాను హోం మంవూతిగా ఉన్నప్పుడు ఎన్సీటీసీకి చిదంబరం రూపకల్పన చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.