ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ‘టీఆర్‌ఎస్’ అభ్యర్థులనే గెలిపించారు

నల్లగొండ ప్రజలకు ధన్యవాదాలు: డాక్టర్ బూర నర్సయ్యగౌడ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రజలను ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులనే నల్లగొండ ప్రజలు గెలిపించారని, ఈ సందర్భంగా ఆ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్లు టీఆర్‌ఎస్ నేత డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని నిలిపారన్నారు. టీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఆర్థికంగా బలహీనులయినా.. వారిని ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాలో ఇకముందు రోజుల్లో టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నదని నర్సయ్యగౌడ్ తెలిపారు….

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.