ఎన్నికల్లో తెలంగాణే ఎజెండా

bjpకాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్సీపీలు తెలంగాణపై దాగుడుమూతలాడుతూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జీ కిషన్‌డ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీలు అమరుల త్యాగాన్ని అవహేళన చేస్తున్నాయని విమర్శించారు. తెలంగాణపై కపటవూపేమ ప్రదర్శిస్తున్న ఆ పార్టీల నేతలు ఎన్ని యాత్రలు చేసినా.. ప్రజలు విశ్వసించరని తెలిపారు. గురువారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్‌డ్డి మాట్లాడుతూ ‘అధికారంలోకి వస్తే’.. అంటూ వరాలు గుప్పిస్తున్న చంద్రబాబు.. ఎన్నటికీ సీఎం అయ్యే అవకాశం లేదన్నారు. రాష్ట్ర విభజనపై గోడమీది పిల్లిలా వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీ సమైక్యవాద పార్టీ అని, ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ పార్లమెంట్‌లో సమైక్యవాద ప్లకార్డు పట్టుకోవడంతోనే తేటతెల్లమైందని విమర్శించారు. తెలంగాణ కోసమే పుట్టామని చెప్పుకుంటున్న కొందరు నేతలు ‘జై తెలంగాణ’ అంటూ జగన్ పార్టీలో చేరడాన్ని ఆయన తప్పుబట్టారు. వచ్చే ఎన్నికలు తెలంగాణే ఎజెండాగా జరుగుతాయని, ప్రజలు తెలంగాణ సాధించే పార్టీకే ఓటు వేస్తారని స్పష్టం చేశారు.

జనవరి నుంచి ఉద్యమం ఉధృతం
పార్టీ సంస్థాగత ఎన్నికలు ముగిసిన అనంతరం జనవరి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కిషన్‌డ్డి ప్రకటించారు. సొంతంగా ఉద్యమ కార్యాచరణతోపాటు జేఏసీ చేపట్టే అన్ని కార్యక్షికమాల్లో పాల్గొంటామని, మార్చిలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ‘ఆంవూధవూపదేశ్ ఉపాధ్యాయ సంఘం’(ఆపస్) తరఫున పోటీ చేసే అభ్యర్థులకు మద్దతిస్తామన్నారు.

.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.