ఎన్డీయే అధికారంలోకి రాగానే తెలంగాణ: జవదేకర్

న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తుందని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు జవదేకర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని, ఆపార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వదని ఆయన విమర్శించారు. రేపటి నుంచి జరుగబోయే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన జేఏసీ నేతలకు స్పష్టం చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.