ఎన్డీఏకు 200.. యూపీఏకు 140.. సీఎన్‌ఎన్ – ఐబీఎన్ – ది వీక్ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి రెండువందల సీట్లు సాధిస్తుందని సీఎన్‌ఎన్ వీక్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. అధికార యూపీఏ కూటమి 134 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. 2009లో మధ్యవూపదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాల్లో మొత్తం 40 ఎంపీ స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ 2014 ఎన్నికల్లో 28 స్థానాలు కోల్పోనున్నట్లు సర్వే అభివూపాయపడింది. ఈ రాష్ట్రాల్లో 2009లో 30 స్థానాలు గెలిచిన బీజేపీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మరో 27 సీట్లు అదనంగా గెలుస్తుందని తెలిపింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో గల మొత్తం 72 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 57 సీట్లు గెలుస్తుందని పేర్కొంది. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ కేవలం 12 సీట్లు మాత్రమే గెలవగలదని తెలిపింది. ఎన్డీఏ మొత్తంగా 187 సీట్లు గెలుస్తుందని అభివూపాయపడింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.