జీ 24 గంటలు పేరు చెప్తే మొదట గుర్తొచ్చేది శైలేష్ రెడ్డి. శైలేష్ రెడ్డి నైతిక జర్నలిజానికి నిలువెత్తు నిదర్శనం. 2009 డిసెంబర్9 తర్వాత సీమాంధ్ర మీడియా కుట్రలను తిప్పికొట్టి.. తెలంగాణ ఉద్యమాన్ని కంటికిరెప్పలా కాపాడిన నిజమైన తెలంగాణ బిడ్డ. ఏ వార్తనైనా డీల్ చేయడంలో ఈయన తర్వాతే ఎవరైనా..
ఇక తర్వాత గుర్తొచ్చేది పొలిటికల్ టీం. ఇలాంటి పొలిటికల్ రిపోర్టర్లు తెలుగు జర్నలిజం లో లేరుగాక లేరు. ఇది తెలుగు ఎలక్ట్రానిక్ మీడియా ఒప్పుకున్న నిజం. వీళ్ల ఎనాలిసిస్. రిపోర్టింగ్, షార్ప్ నెస్‌ను అందుకోవడం ఎవరితరం కాదు.
సతీష్ కమాల్, శ్రీధర్ రావు, విజయ్, వాసు, శివకేశవ్. ఎక్సెలెంట్ పొలిటికల్ టీం. ఏ చానల్లోనూ ఇలాంటి చాకుల్లాంటి జర్నలిస్టులు లేరు. జర్నలిజంలో వీళ్లంత డెడికేటెడ్ గా పనిచేసేవాళ్లు లేరనే చెప్పాలి.
క్రైం టీం గౌస్, సుధాకర్ గౌడ్, ఇన్నారెడ్డి కూడా చాలా బాగా పనిచేసేవారు.