ఎక్కువతక్కువ మాట్లాడితే నాలుక కోస్తాం: శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ ప్రజలను అవమానించేలా అసత్యాలు మాట్లాడుతున్న ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు ఖబడ్దార్ అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు వీ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. వ్యవహారశైలి మారకపోతే, తెలంగాణపై ఎక్కువ తక్కువ మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. సోమవారం నాంపల్లిలోని గృహకల్ప ప్రాంగణంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం కార్యాలయం ఆడిటోరియంలో ‘సకలజన భేరి సన్నాహక సమావేశం’ అనంతరం ఆయన మాట్లాడుతూ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో ఉద్యోగం చేస్తున్న అశోక్‌బాబు అహంకారపూరితంగా విర్రవీగుతూ ప్రజలలో విద్వేషాలు సృష్టిస్తుండటాన్ని తప్పుబట్టారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు విఠల్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కీలక దశకు చేరుకున్న నేపధ్యంలో సకల జనభేరి సభ జరుగుతున్నదని, ఈ సభకు భారీఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.