ఎంపీ అసదుద్దీన్‌ను సంగారెడ్డి జైలుకు తరలింపు

మెదక్ : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. కలెక్టర్‌ను దూషించిన కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. బెయిల్ కోసం దాఖలు చేసుకున్న అసదుద్దీన్‌ను పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. అసదుద్దీన్‌ను కోర్టుకు తరలించడంతో హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.