ఎండిన పంటను చూపిస్తే రాజీనామా చేస్తారా: ఈటెల

వరంగల్ జిల్లాలో కరెంట్ కోతలతో పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయి. జిల్లాలో ఎండిపోయిన పంట పొలాలను చూపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎండిన పంటను చూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అని టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ జిల్లాకు చెందిన మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు సవాలు విసిరారు. ఇవాళ జిల్లా మంత్రి పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజక వర్గంలోని జనగాం, రఘునాథ్‌పల్లి, ఖిలాషాపూర్‌లలో ఎండిపోయిన పంట పొలాలను టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల బృందం పరిశీలించింది. కాగా, ఏప్రిల్ 9న వామపక్షాలు చేయనున్న బంద్‌పై పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీఆర్‌ఎస మ్మెల్యేలు తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.