ఉమ్మడి హైకోర్టుతో తెలంగాణకు నష్టం

డిసెంబర్ 16 : ఆంధ్రవూపదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లులో హైకోర్టు, న్యాయవ్యవస్థపై నాలుగో షెడ్యూలులో వివరాలను పొందుపరిచారు. దీని ప్రకారం కొత్తగా ఏర్పాటుకానున్న రెండు రాష్ట్రాల్లోనూ ప్రత్యేక హైకోర్టులు ఏర్పాటు చేస్తారు. 13 జిల్లాలతో నూతన ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేస్తారు. ఈ ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేసేవరకు ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టునే రెండు రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానంగా వ్యవహరించనుంది. ప్రస్తుతం ఉన్న హైకోర్టునే ఉమ్మడి హైకోర్టుగా ముసాయిదా బిల్లులో పేర్కొనడం సరికాదని తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తంచేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంవూధకు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని తెలంగాణకు చెందిన సీనియర్ న్యాయవాది డీ ప్రకాశ్‌డ్డి సూచించారు.

తెలంగాణ ప్రాంతానికి హైకోర్టు, న్యాయవ్యవస్థ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై డీ ప్రకాశ్‌డ్డి ఆధ్వర్యంలో తెలంగాణ న్యాయవాదుల బృందం తమ నివేదికను గతంలో జీవోఎంకు సమర్పించింది. తాము నివేదికలో తెలిపిన అంశాలను జీవోఎం పరిగణనలోకి తీసుకోలేదని ప్రకాశ్‌డ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ‘ఉమ్మడి హైకోర్టు ఎప్పటివరకు కొనసాగుతుంది.. తదితర విషయాలపై బిల్లులో స్పష్టత లేదు. కొత్త ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలంటే మరోసారి పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. షెడ్యూలు 4లోని 30,31,32 పేరాల్లో పలు అంశాలు సమస్యాత్మకంగా ఉన్నాయి.

ప్రస్తుత హైకోర్టులోని న్యాయమూర్తులను ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించే విషయంతోపాటు, జీతభత్యాల విషయంలోనూ ఈ అంశాలు సముచితంగా లేవు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికి న్యాయమూర్తులుగా అవకాశాలు తగిన స్థాయిలో దక్కలేదు. న్యాయమూర్తుల ఎంపికలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది. ప్రస్తుత న్యాయమూర్తులను ఉమ్మడి హైకోర్టులోనూ కొనసాగించడంతో తెలంగాణ ప్రాంతానికి ప్రయోజనం లేకుండా పోతుంది. 30,31,32 పేరాల్లోని అంశాలను మార్చాల్సి ఉంది. ఈ మేరకు టీ న్యాయవాదుల బృందం కృషిచేస్తుంది. ఈ విషయాలను మంగళవారంలోగా తెలంగాణ ఎమ్మెల్యేలకు అందిస్తాం’ అని ఆయన తెలిపారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.