ఉమ్మడి పరీక్ష సాధ్యమేనా?

ఉన్నత, సాంకేతిక, మెడికల్ కళాశాలల్లో వివిధ కోర్సుల ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే ఉమ్మడి పరీక్ష విధానం ఈసారి సాధ్యమయ్యే పరిస్థితి కనిపించటం లేదు. 2014-15 విద్యా సంవత్సరంలో ఎంసెట్, లాసెట్, ఐసెట్‌తో పాటు ఇతర సెట్ల పరీక్షలు ఉమ్మడిగా నిర్వహించి కామన్ ర్యాంకింగ్ ద్వారా రెండు రాష్ట్రాల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర పునర్విభజన డ్రాఫ్టు బిల్లులో కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.
Studentsరెండు రాష్ట్రాల్లో పదేళ్ళ పాటు ప్రస్తుత అడ్మిషన్ విధానమే ఉంటుంది. అయితే రెండు రాష్ట్రాలు అంగీకరిస్తేనే ఈ విధానాన్ని అమలు చేయాలని బిల్లులో నిర్దేశించారు. దీంతో ఉమ్మడి విధానంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. తెలంగాణలో సీమాంధ్ర విద్యార్థులు 15 శాతం నాన్‌లోకల్ కోటాలో ప్రవేశాలు పొందాలంటే తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించే ఎంసెట్ లేదా ఇతర సెట్లకు హాజరు కావాల్సి ఉంటుంది. సీమాంవూధలో ప్రవేశాలకోసం తెలంగాణ విద్యార్థులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది. రెండు రాష్ట్రాల్లో పదేళ్లపాటు ఉమ్మడి అడ్మిషన్ విధానం ఉన్నప్పుడు ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా ఇరు రాష్ట్రాల్లో అడ్మిషన్లు నిర్వహించటం సులభమతుందని ఉన్నత విద్యా మండలి అధికారులు భావిస్తున్నారు. అందుకు వీలుగా డ్రాఫ్టు బిల్లులో సవరణకు సూచనలు చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా అక్రమ అడ్మిషన్లు నిర్వహించిన కాలేజీలకు ఉన్నత విద్యామండలి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆయా కళాశాలల వివరాలను మండలి చైర్మన్ వేణుగోపాల్‌డ్డి మీడియాకు మంగళవారం వెల్లడించారు. ఈ కాలేజీపై చర్యలు తీసుకుంటామని వేణుగోపాల్‌డ్డి తెలిపారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.