ఉప్పల్ – పోచారం కొత్త ఐటీ హబ్

 

buidingఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో ప్రకటించిన 3వ జోన్ ద్వారా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయి. పారిశ్రామికంగా ఇప్పటికే అభివృద్ధి పథంలో పయనిస్తున్న ఈ జోన్ ఐటీ రాకతో ప్రపంచ స్థాయి అభివృద్ధికి చేరుకోనుందనే అంచనాలు పెరుగుతున్నాయి. మూడో జోన్ ఉప్పల్, పోచారం ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. మాదాపూర్, గచ్చిబౌలిలకు ప్రత్యామ్నాయంగా ఐటీ కంపెనీలు ఉప్పల్ ప్రాంతాన్ని ఇప్పటికే ఎంచుకున్నాయి. కొన్ని కంపెనీలు ఏకంగా భూములను కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టాయి. మరో ఐటీ కారిడార్‌గా ఉప్పల్ ప్రాంతం మారుతుందన్న ప్రచారం జరుగుతుండగానే ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుండటం కలిసొచ్చే అంశం. పారిశ్రామిక వాడలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, రీసెర్చ్ సంస్థలు, ఉప్పల్ ప్రాంతానికి తలమానికంగా మారగా, మెట్రో రైలు డిపో ఏర్పాటు కానుండటం, తాజాగా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రానుండటంతో ఉప్పల్ దశ మారిపోనుంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ప్రధానంగా ఉప్పల్, పోచారం పరిధుల్లో విస్తరించనుంది.

Genpactమొత్తంగా 10.3 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మూడో జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. జోన్ 3 ప్రాంతంలో ఇది వరకే పలు ఐటీ సెజ్‌లు ఏర్పాటయ్యాయి. ఈ కారిడార్ ప్రాంతంలోనే ఇన్ఫోసిస్ సెజ్, టాప్నొటెక్ సెజ్, ఇకోనియా, హేమ్‌దారి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవెట్ లిమిటెడ్, ప్రజయ్ టెక్నోపార్క్, జెన్‌పాక్ట్, సురానా టెక్నో పార్కు, సింగపూర్ టౌన్‌షిప్, రహేజా ఐటీ పార్కు భాగ్యనగర్ మెటల్స్ లిమిటెడ్ కంపెనీలు ఉన్నాయి. వీటితో పాటు నాచారం పారిక్షిశామిక వాడ, మల్లాపూర్ పారిశ్రామిక వాడ, చర్లపల్లి పారిక్షిశామిక వాడలతో పారిశ్రామికంగా నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఐటీ రాకతో మరో ముందడుగు పడనుంది.

మ్యాప్‌లో గుర్తించిన కంపెనీలు..
బ్రౌన్‌ఫీల్డ్ ఏరియా : ప్రజయ్ టెక్నో పార్క్, జెన్‌పాక్ట్, సురానా ఐటీ పార్కు, సింగపూర్ టౌన్‌షిప్, రహేజా ఐటీ పార్కులు ఏర్పాటయ్యాయి.

గ్రీన్ ఫీల్డ్స్ ఏరియా…
ఇన్ఫోసిస్ సెస్, హేమదారి ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇకోనియా, టాప్నొటెక్ సెజ్, భాగ్యనగర్ మెటల్స్ లిమిటెడ్‌లు ఉన్నాయి.

areaవిస్తరించే పరిధి…
వరంగల్ రాష్ట్ర రహదారిలోని ఉప్పల్ సమీపంలోని హబ్సిగూడ సీసీఎంబీ వద్ద గల ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి ఐడీఏ నాచారం వరకు అక్కడి నుంచి దక్షిణం వైపు తిరిగి నాచారం చెరువు మీదుగా 30 మీటర్ల రోడ్డు ద్వారా మల్లాపూర్ ఐడీఏను తాకుతూ ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కనే ఉన్న జెన్‌పాక్ట్ వరకు, రెండో ప్రాంతంలో పోచారం మార్గంతో వరంగల్ హైవే, సింగపూర్ టౌన్‌షిప్, రహేజా ఐటీ పార్కు ఇన్ఫోసిస్ సెజ్ వరకు విస్తరించనుంది. దీని చివరి మూల చర్లపల్లి పారిశ్రామిక వాడను తాకుతూ వెళ్లనుంది.

మెండుగా మౌలిక సదుపాయాలు…
ఉప్పల్ పోచారం పరిధిలో మౌలిక సదుపాయాలు మెండుగా ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్‌లు ఈ జోన్‌కు ప్రత్యేకతనిస్తున్నాయి. మిగతా జోన్ల కన్నా ఈ జోన్ విస్తీర్ణం చిన్నదే అయినా ఇక్కడున్నంత మౌలిక సదుపాయాలు మరే జోన్‌కు లేకపోవడం గమనార్హం. ఇప్పటికే ఐటీ కంపెనీలతో విరాజిల్లుతున్న జోన్ 1కు మౌలిక సదుపాయాల్లో వెనుకబడి పోయిందన్న వాదనలు ఉన్నాయి. దీంతోనే ఐటీఐఆర్ ముసాయిదాలో రోడ్లు, మౌలిక సదుపాయాల్లో జోన్ 1కు కీలక స్థానం దక్కింది. రోడ్లు, విద్యుత్, నీటి, సివరేజీ సౌకర్యాల్లో ఉప్పల్, పోచారం జోన్ అన్నింట్లో ముందంజలోనే ఉంది. ఇక్కడి నుంచి 20 నిమిషాల్లో ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. వరంగల్ రహదారి పక్కనే ఉండటం కూడా అదనపు లాభం. పైగా ఐటీ ఉద్యోగులు ఉండేదుకు తక్కువ ధరల్లోనే భూములు, అద్దెలు లభించడం కూడా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఒక్క రెండు రేడియల్ రోడ్లు తప్ప ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌లో ఉప్పల్, పోచారంకు కేటాయింపులు లేకపోవడం గమనార్హం.

gatkesarఅభివృద్ధి- అవకాశాలు..
-రోడ్లు.. విద్యుత్ సౌకర్యం…
-హబ్సిగూడ మీదుగా నాచారం, మల్లాపూర్ ద్వారా పోచారం వరకు చక్కటి రహదారి అందుబాటులో ఉంది.
-హబ్సిగూడ సర్వే ఆఫ్ ఇండియా నుంచి మజ్‌నీర్‌గూడ రైల్వే స్టేషన్ వరకు 14.5 కిలోమీటర్ల రహదారిని రూ.80 కోట్లతో చేపట్టనున్నారు.
-ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వరకు 13.9 కిలోమీటర్ల రహదారిని 40 కోట్లతో చేపడుతున్నారు.

ఇతర మండలాలపై ప్రభావం…
ఉప్పల్ పోచారం ఐటీఐఆర్ ప్రాజెక్ట్ కారణంగా పక్కనే ఉన్న శామీర్‌పేట, మేడ్చల్, కుత్బుల్లాపూర్ మండలాలపై కుడా ప్రభావం చూపనుంది. శామీర్‌పేట మండలం జవహర్‌నగర్, కుత్బుల్లాపూర్ మండలంలోని బహద్దూర్‌పల్లి గ్రామాల్లో ఐటీ సెజ్‌లు ఏర్పాటయ్యాయి.

పరిధిలోని మండలాలు…
ఈ జోన్ పరిధిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన రెండు మండలాలు మాత్రమే ఉన్నాయి. ఉప్పల్, ఘట్‌కేసర్ మండలాల్లో 3వ జోన్ ఏర్పాటు కానుంది. ఉప్పల్ మండలం అర్బన్ ప్రాంతంలోనే ఉన్నా ఘట్‌కేసర్ మండలం పూర్తిగా గ్రామీణ ప్రాంతంగానే ఉంది. ఘట్‌కేసర్ మండలంలో అత్యధికంగా ఇంజినీరింగ్ వృత్తి విద్యా కళాశాలలు ఉండటంతో నిరుద్యోగులు తగ్గి ఉపాధి అవకాశాలు కుడా పెరగనున్నాయన్న అంచనాలు బలపడుతున్నాయి.

అంతర్జాతీయ గుర్తింపు
ఉప్పల్/బోడుప్పల్/నాచారం, టీ మీడియా:అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటైన స్టేడియం… సాప్ట్‌వేర్, ఐఐటీ కంపెనీల ఏర్పాటు… గ్రేటర్‌కు తలమానికంగా నిలవనున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు.. త్వరలో రూపొందనున్న గ్రీన్ సిటీ.. ఇలా అన్ని హంగులతో ఉప్పల్ రూపురేఖలు మారుతున్నాయి. ఒకప్పుడు గడ్డిపొలాలతో కనిపించిన ఉప్పల్ నేడు హైటెక్ హంగులతో మోడల్ సిటీతో పాటు ఐఐటీ సెజ్‌లు ఏర్పాటు కావడంతో శరవేగంగా రూపాంతరం చెందుతోంది.

metroraildepotప్రధాన కేంద్రంగా….
ఉప్పల్ నుంచి నాగోల్‌కు వెళ్లే దారిలో 150 ఎకరాల స్థలంలో మెట్రో రైల్ స్టేషన్ ఏర్పాటుకు పనులు, అంతర్జాతీయంగా పేరొందిన ఐటీ కంపెనీలు కొలువుతీరడంతో రాబోయే రోజుల్లో ఉప్పల్ మరింత ప్రాధాన్యత పెరగనుంది. 195 ఎకరాల విస్తీర్ణంతో ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉన్న ఉప్పల్ కాలక్రమంలో మున్సిపాలిటీగా మారింది. రెండు లక్షల జనాభా ఉన్న ఉప్పల్ సర్కిల్‌లో 45వేలకు పైగా గృహసముదాయాలున్నాయి.

గ్రీన్‌సిటీ లే అవుట్‌తో…
ఉప్పల్ భగాయత్ పరిధిలోని భూములతో కొత్తగా గ్రీన్‌సిటీ లే అవుట్‌కు ఆమోదం లభించడంతో ఇక్కడి స్థలాలకు రెక్కలు వచ్చాయి. హైటెక్ హంగులతో విశాలమైన రోడ్లు, సువిశాలమైన పార్కులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా హెచ్‌ఎండీఏ మోడల్ లే అవుట్ రూపొందించి పనులు కొనసాగుతున్నాయి. ఉప్పల్ భగాయత్ పరిధిలోని 733 ఎకరాల, రామంతాపూర్ భగాయత్ పరిధిలోని 104 ఎకరాల వాటర్ వర్స్ విభాగానికి, 150 ఎకరాలు సివరేజ్ బోర్డుకు కేటాయించారు. మరో 180 ఎకరాలు మెట్రో రైల్ స్టేషన్ ఏర్పాటు కోసం కేటాయించారు. అయితే ఇంకా 413 ఎకరాల భూమి ఉండగా దీన్ని మోడల్ లే అవుట్‌గా రూపొందించారు. లే అవుట్‌లో 40శాతం స్థలాన్ని ప్లాట్లు అభివృద్ధి చేసి మిగతా 60శాతం స్థలాన్ని వివిధ వసతుల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. మూసీ వరదనీటి ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకొని మూసీ పక్కన 200 అడుగుల స్థలాన్ని బఫర్‌జోన్‌గా ప్రకటించి, దాని పక్కనే 100 అడుగుల స్థలంలో రోడ్డు నిర్మిస్తున్నారు.

rahejaఆధునిక హంగులతో మల్టీప్లెక్స్‌లు…
ఆధునిక హంగులతో ఉప్పల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న మల్టీప్లెక్స్‌లు, ఆధునాతన షాపింగ్ మాల్స్ నిర్మానాలతో ఈ ప్రాంతం కొత్తశోభను సంతరించుకోనుంది. ఆరు సినిమా హాళ్లు , షాపింగ్ మాల్స్, ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. మెట్రో రైల్ పనులు, గ్రీన్‌సీటీ నిర్మాణం పూర్తయితే ఉప్పల్ రూపురేఖలు మారి అంతర్జాతీయ స్థాయితో గుర్తింపు పొందుతుందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

నాచారం, మల్లాపూర్ అభివృద్ధి..
ఉప్పల్ ప్రాంతం ఐటీ హంగులతో శరవేగంగా మారుతున్న తరుణంలో నాచారం, మల్లాపూర్ పారిశ్రామిక వాడలు అభివృద్ది చెందనున్నాయి. ఇప్పటికే సెజ్‌ల పేరుతో నాచారం పారిశ్రామికవాడలోని ఐదున్నర ఎకరాల్లో రహేజాఇష్ట, గృహ సముదాయాలను శర వేగంగా నిర్మాణం చేశారు. దీంతోపాటు పలు ఐటీ పార్కులను నెలకొల్పడంతో నాచారం, మల్లాపూర్ పారిశ్రామికవాడలకు జాతీయ స్థాయి గుర్తింపు తీసుకువచ్చాయి.

గ్రోత్ కారిడార్ పోచారం
ఘట్‌కేసర్/కీసర/శామీర్‌పేట, టీ మీడియా :నగర శివారులోని ఘట్‌కేసర్ మండలంలోని పోచారం ఐటీ హబ్‌గా మారనుంది. ఇప్పటికే ఇక్కడ సంస్కృతి టౌన్‌షిప్, ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, ఐటీ రహేజా పార్కు, రాజీవ్ సద్భావన్ కార్పొరేషన్ వంటి గృహ నిర్మాణాలు కాగా ఈ ప్రాజెక్టుల చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావస్తోంది. ఎంఎంటీఎస్ రైల్వే ప్రాజెక్టును ఘట్‌కేసర్ వరకు పొడిగించాలనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. సంస్కృతి టౌన్‌షిప్ నిర్మాణానికి ప్రభుత్వం 130 ఎకరాలు, పక్కనే ఐటీ రహేజా పార్కుకు 105 ఎకరాల స్థలం కేటాయించారు. ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీకి దాదాపు 427 ఎకరాల స్థలం కేటాయించగా కేవలం యాబై ఎకరాల్లో సదరు కంపెనీ భవన నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సుమారు 8 వేల మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పరోక్షంగా మరో రెండు వేల మంది పనిచేస్తున్నారు.

samskruthi మున్ముందు మరిన్ని ఉద్యోగావశాలు పెరిగే అవకాశం ఉంది. మండలంలోని పోచారంతో పాటు ఏదులాబాదులో సుమారు 450 ఎకరాలు ఇండస్ట్రీయల్ జోన్ కింద పరిక్షిశమలు ఏర్పాటు చేయడానికి భూ సేకరణకు స్థానిక అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయి. వచ్చే ఏడాది ప్రభుత్వం భూసేకరణ చేపట్టనుంది. మండలంలోని కాచవాని సింగారంలో దిల్ కంపెనీకి ప్రభుత్వం 58 కేటాయించినప్పుటికీ ఇంకా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. ఇక్కడికి దగ్గర్లలోనే వరంగల్ జాతీయ రహదారి(163), ఔటర్ రింగురోడ్డు, దక్షిణ మధ్యరైల్వే ప్రధాన రైల్వే ట్రాక్‌కు దగ్గరల్లోనే ప్రభుత్వ స్థలాలు ఉండటం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టే ఐటీఐఆర్ ప్రాజెక్టులు ఇక్కడికి తరలిరానున్నాయని సమాచారం. దీంతో భూముల రేట్లు తెలంగాణ అంశంతో సంబంధం లేకుండా ఊపందుకున్నాయి. పోచారం పరిధిలోనే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 38 ఎకరాల స్థలంలో రాజీవ్ సద్భావన కార్పొరేషన్ ఆధ్వర్యంలో సుమారు మూడు వేల వరకు ప్లాట్ల నిర్మాణం చేపట్టింది. దాదాపు 70 శాతం వరకు నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

rajivశామీర్‌పేట మరింత అభివృద్ధి..
ఐటీఐఆర్ ఏర్పాటుతో జవహర్‌నగర్‌తో పాటు శామీర్‌పేట, కీసర మండలాలు మరింత అభివృద్ధి సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐటీఐఆర్‌తో జవహర్‌నగర్‌లో వివిధ పరిశ్రమలు, హైటెక్ కంపెనీలు, వివిధ విశ్వవిద్యాలయాలు ఏర్పడుతున్నాయి. జవహర్‌నగర్ పరిధిలో బిట్స్ ఫిలానీ 203 ఎకరాలు, సీఆర్‌పీఎఫ్‌కు 229 ఎకరాలు, ఆర్మీ డెంటల్ కళాశాలకు 42 ఎకరాలు, రాజీవ్ స్వగృహకు 210 ఎకరాలతో పాటు వివిధ సంస్థలకు వందల ఎకరాల్లో స్థలాన్ని కేటాయించిన విషయం విదితమే. బిట్స్ ఫిలానీ హైదరాబాద్ క్యాంపస్ ఏర్పాటుతో సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కాయి. అదే విధంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రాజీవ్ స్వగృహ పూర్తవడంతో దాదాపుగా మరో వెయ్యిమందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.

bitsభూముల ధరలకు రెక్కలు..
జవహర్‌నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోని 5977 ఎకరాల ప్రభుత్వ భూమితో పాటు శామీర్‌పేట, కీసర మండలాల భూముల రేట్లు అమాంతం పెరిగిపోనున్నాయి. ఐటీఐఆర్‌తో పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటుతో ఉద్యోగాల కోసం వలసలు రావడం, స్థానికంగా నివసించేందుకు ప్రజలు ఎక్కువ శాతంలో మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం లక్షల్లో ఉన్న భూముల ధరలు ఐటీఐఆర్‌తో కోట్లకు పరుగెత్తుతుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

జవహర్‌నగర్‌లో వివిధ సంస్థలకు భూకేటాయింపులు ..
జవహర్‌నగర్ రెవెన్యూ పరిధిలో ఐటీఐఆర్ కోసం ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన స్థలంలో ప్రస్తుతం ఉన్న భూముల వివరాలు ఏపీ ట్రాన్స్ కో 65-18 ఎకరాలు, బిట్స్‌కు 203-21, సీఆర్‌పీఎఫ్‌కు 229-25, దిల్ సంస్థకు 60-25, ఫైరింగ్ రేంజ్ 665-05, హుడా 1722-21, డిఫెన్స్ ఈఎంఈ 118-18, ఆర్మీ డెంటల్ కాలేజ్ 42-31, డపింగ్ యార్డు 360-21, ఆర్మీ డేరి ఫారం 230-10, రాజీవ్ స్వగృహ ఏపీహెచ్‌బీ 210, సెక్ర ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ 100 ఎకరాల భూములను కేటాయించింది ప్రభుత్వం

This entry was posted in ARTICLES.

Comments are closed.