న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా చేపట్టిన జాతీయ కార్మికుల సమ్మె ఉద్రిక్తతలకు దారి తీసింది. ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంద్కు సహకరించని ఫ్యాక్టరీలు, దుకాణాలపై ఆందోళనకారులు దాడి చేశారు. దాడిలో పలు భవనాలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో పలు వాహనాలకు నిప్పు పెట్టారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఆందోళనకారులపై లాఠీలు ఝులిపించారు. కొన్ని చోట్ల ఆటోలు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ఢిల్లీలో మెట్రో రైళ్లు నడవలేదు. దీంతో ప్రయాణికులు నానా తంటాలు పడ్డారు.
ఉద్రిక్తలకు దారితీసిన భారత్ బంద్
Posted on February 20, 2013
This entry was posted in NATIONAL NEWS, Top Stories.