ఉద్యోగుల కేటాయింపునకు కమిటీలు: జైరాం

ఢిల్లీ: తెలంగాణ, సీమాంధ్రకు ఉద్యోగాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఐఏఎస్ అధికారులు… దాదాపు రాష్ట్రస్థాయి 84 వేల మంది ఉద్యోగుల కేటాయింపునకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్రకటించారు. సీమాంధ్రలో అభివృద్ధి, నిధుల కేటాయింపునకు డిప్యూటీ చైర్మన్ నేతృత్వంలో ప్లానింగ్ కమిషన్‌లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేస్తామన్నారు.

తెలంగాణ బిల్లును పూర్తి రాజ్యంగబద్ధంగా రూపొందించామన్నారు. గవర్నర్ కు లా అండ్ ఆర్డర్ కొత్తకాదని తెలిపారు. సుప్రీం తీర్పుల ప్రకారమే వ్యవహరించామని పేర్కొన్నారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూశామన్నారు. విద్య, ఉద్యోగాలు, సాగునీటి విషయంలో సీమాంధ్రకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు.

సీమాంధ్రులకు విద్యావకాశాలు పదేళ్ల వరకు ఉంటాయన్నారు. ఆర్థిక సాయంలోనూ సీమాంధ్రులకు చాలా మేలు జరిగిందన్నారు. సీమాంధ్రకు ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఉంటుందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని అభివృద్ధి సాధించాలని కోరారు.

బిల్లు త్వరలో రాష్ట్రపతికి వెళుతుంది. ఆ తర్వాత గెజిట్ విడుదల అవుతుంది. గెజిట్ విడుదల తేదీ నుంచి కొత్త రాష్ట్రం ఆవిర్భవించినట్టేనని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.