ఉద్యోగాల భర్తీకి తెరతీసిన సర్కారు

ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడంలోనూ, కొత్తగా ఉద్యోగాలు కల్పించడంలోనూ ప్రభుత్వం కొత్త రికార్డు సృష్టించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 34,450 పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు, త్వరలో మరిన్ని నియామకాలు చేపట్టనున్నట్లు సీఎం కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలో భర్తీచేయనున్న ఉద్యోగాల వివరాలను వెల్లడించింది. 12,072 ఉద్యోగ ఖాళీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, 7,346 పోస్టులను డిపార్టుమెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా, 14 ఉద్యోగాలను ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజీ ద్వారా, 11,387 పోస్టులను పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా, మరో 133 పోస్టులను యూనివర్సిటీల ద్వారా భర్తీ చేస్తారు.
భర్తీ చేయనున్న ఉద్యోగ ఖాళీల వివరాలు: గిరిజనశాఖ ఉపాధ్యాయులు -1877, ఎక్సైజ్ ఎస్సైలు – 314, ఎక్సైజ్ సూపరింటెండెంట్ – 24, జూనియర్ కాలేజీ లెక్చ రర్లు (జీఎల్) – 4,523, డిగ్రీ కాలేజీ లెక్చరర్లు (డీఎల్) – 617, టీఎల్ – 180, డాక్టర్స్ – 2,000, ఏపీఎస్సీ కానిస్టేబుల్ – 3,848, సివిల్ కానిస్టేబుల్ – 4,661, కానిస్టేబుల్ కమ్యూనికేషన్ – 748, కానిస్టేబుల్ ట్రాన్స్‌పోర్టు – 214, డిప్యూటీ కలె క్టర్లు – 10, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు – 59, పీఆర్‌వో – 5, అసిస్టెంట్ పీఆర్‌వో – 21.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.