ఉద్యమ నేతలను విడుదల చేస్తరో.. వేలాది మందిని జైల్లో పెడ్తరో తేల్చుకోండి-జైలు ముందు నినదించిన తెలంగాణ

ఉద్యమ నేతలను విడుదల చేస్తరో.. వేలాది మందిని జైల్లో పెడ్తరో తేల్చుకోండంటూ మహబూబ్ నగర్ జిల్లా జైలు ముందు తెలంగాణ నినదించింది.  పాలమూరు జిల్లా జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది తెలంగాణవాదులు జైలు వద్దకు చేరుకుని జై తెలంగాణ నినాదాలు చేస్తున్నారు. సడక్ బంద్ సందర్భంగా అక్రమ అరెస్టులను నిరసిస్తూ తెలంగాణవాదులు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. సీమాంధ్ర సర్కారు నిరంకుశ వైఖరి నశించాలి… జై తెలంగాణ… అంటూ నినాదాలు చేస్తున్నారు. జైలు గేటుపైకి ఎక్కి లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు.

జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఆర్‌ఎస్ ఎమ్మల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, టీఎన్‌జీఓ నేత శ్రీనివాస్‌గౌడ్‌లను వెంటనే విడదుల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. వేలాది మంది తెలంగాణవాదులు జైలు ముందు రోడ్డుపై భైఠాయించి ఆట పాటలతో కదం తొక్కుతున్నారు. ఎర్ర ఎండటిని సైతం లెక్క చేయకుండా జిల్లా వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛంధంగా అరెస్టైన నేతలకు మద్దతుగా మహబూబ్‌నగర్ జిల్లా జైలు వద్దకు తరలి వచ్చారు. అందరూ ముక్తం కంఠంతో ఒక్కటై నినదించారు. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి ఎంత మందిని జైల్లో పెడతారో పెట్టుకోమనండి, పోలీసులకు, జైలుకు భయపడమని, తెలంగాణ సాధించుకునేవరకు పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.