ఉద్యమ నేతలకు పోరుతెలంగాణ ఘనస్వాగతం

గ్రాండ్ వెల్కం టు అవర్ ఫైటర్స్ కోదండరాం, ఈటెల, జూపల్లి, శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణ ఉద్యమ నేతలకు మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపూర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.  దీంతో ఉద్యమ నేతలు శనివారం రాత్రి 8.20 కి విడుదలయిన్రు.  సడక్‌బంద్‌లో పాల్గొని జిల్లా జైళ్లో రిమాండ్‌లో ఉన్న తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావుతోపాటు ఎనిమిది మందికి న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. పదివేల రూపాయల పూఛీకత్తుతో బెయిల్ పొందాలని ఉత్తర్వుల్లో ఆదేశించారు. మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, ఉద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్, భూషణం, మ్మ గోవర్ధన్, దుబ్బన్న, కావేటి సమ్మయ్య, గట్టు తిమ్మన్న, తుమ్మల రవిలు బెయిల్ పొందిన వారిలో ఉన్నారు. ఉద్యమకారులందరికీ పోరుతెలంగాణ ఉద్యమస్వాగతం పలుకుతున్నది.

 

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.