హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమ తీవ్రత తగ్గించడానికే కొన్ని సీమాంద్ర విష పుత్రికలైన పత్రికల్లో ఓ పత్రిక ఉద్యమ రథసారథి కేసీఆర్‌పై ముఖ్యమంత్రి కొసం ఢిల్లీలో బేరం చేశాడని ఆసత్య, విష ప్రచారం చేసిందని టీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ మండిపడ్డారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయనను ఢిల్లీకీ ఎవరూ పిలువలేదని పతాక స్థాయిలో వార్తలు రాసిన పత్రికలు, ఇప్పుడు బేరాలు చేశాడని ఎలా రాస్తారని వినోద్ ప్రశ్నించారు. ఇంతకు ముందుకూడా షిప్‌లు ఉన్నాయని కేసీఆర్‌ను టార్గెట్ చేసుకొని ఓ పత్రిక తప్పుడు వార్త రాసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని కేసీఆర్ సీఎం పదవి అడిగిండని అనడం అసత్యమని ఆయన ఖండించారు. కేసీఆర్ ఏనాడు పదవుల కోసం పెంపర్లాడలేదని ఆయన వివరించారు. యూపీఏ ప్రభుత్వ మనుగడ కోసం కేంద్రమంత్రి పదవిని ప్రమాణ స్వీకారం చేసిన గంటకే వదులుకున్న మహోన్నవ్యక్తి కేసీఆర్ అని వినోద్ వివరించారు. కేంద్రంలో మంత్రి పదవి కూడా తెలంగాణ కోసం మాత్రమే ఉపయోగించుకున్నామన్నారు. తెలంగాణపై అన్ని పార్టీల మద్దతు కోసం మంత్రి పదవుల ద్వారా వచ్చిన కారును ఉపయోగించుకున్నాము తప్ప స్పప్రయోజలకు పదవులను ఎనాడు ఉపయోగించుకోలేదన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన ఘనత కేసీఆర్‌దే నని స్పష్టం చేశారు. పదేండ్ల కింద తెలంగాణ పదం ఆకాశవాని వాతావరణ వార్తల్లో మాత్రమే వినిపించేదని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్‌పై ఎన్ని విషప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. ఇంకోసారి ఇలాంటి ప్రచారం చేస్తే ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఉద్యమ తీవ్రత తగ్గించేందుకే విషప్రచారం: వినోద్
Posted on January 31, 2013
This entry was posted in TELANGANA NEWS, Top Stories.