‘ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేది టీఆర్‌ఎస్సే’-ఎంపీ వివేక్

హైదరాబాద్: తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేది టీఆర్‌ఎస్ పార్టీయే అని పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ వినోద్ అన్నారు. ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గమనించాలని ఆయన కోరారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచడం ఎవరి తరం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ఏర్పాటుపై చంద్రబాబునాయుడు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

టీఆర్‌ఎస్, కేటీఆర్‌లపై బాబు వ్యాఖ్యలు అర్థరహితం
టీఆర్‌ఎస్ పార్టీపైనా, ఆపార్టీ నేత కల్వకుంట్ల తారక రామారావుపైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను వివేక్ తీవ్రంగా ఖండించారు. బాబు వ్యాఖ్యలు అర్థరహితమని ఆయన అన్నారు. కేసీఆర్‌పైనా, టీఆర్‌ఎస్‌పైనా విమర్శలు చేయడం బాబు మానుకోవాలని ఆయన కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.