ఉద్యమశక్తులన్నీ టీఆర్‌ఎస్‌లోకి రావాలి

KCR-01

అటు పోరాట పంథా.. ఇటు రాజకీయ ఎత్తుగడలతో తెలంగాణ ఉద్యమం రానున్న రోజుల్లో కొత్త పుంతలు తొక్కబోతున్నది. దానికి భూమిక సిద్ధం చేస్తూ రాజకీయ, ఉద్యమక్షిశేణులు కలిసికట్టుగా పని చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఇందులో భాగంగా బుధవారం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావును కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కే కేశవరావు ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. రాజకీయ పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై వారిద్దరు ఏకాంతంగా చర్చించుకున్నారు. మరోవైపు టీ జేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్‌ను వెంటబెట్టుకుని వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. వీరి సమావేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. టీ కాంక్షిగెస్ నేతలు విడిగా భేటీలు జరిపారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నేతలు జానాడ్డి, కోమటిడ్డి వెంకట్‌డ్డితో తన సమావేశం అనంతరం కేశవరావు.. కేసీఆర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అనంతరం విలేకరులతో మాట్లాడిన కేకే.. తెలంగాణకోసం అన్ని శక్తులను ఏకం చేస్తానని చెప్పారు. కేంద్రానికి డెడ్‌లైన్‌లు పెట్టడం కాదని, తామే డెడ్‌లైన్‌లు విధించుకుంటున్నామని చెప్పడం విశేషం. తెలంగాణ అంశంలో ఒకటి రెండు రోజుల్లో కేంద్రానికి టీ కాంగ్రెస్ నేతలు ఘాటైన లేఖ రాయనున్నారని వెల్లడించారు. తెలంగాణను కాంగ్రెస్ ఏర్పాటు చేయకుంటే తాము జనంబాటపడతామని అన్నారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్‌ఎస్ అగ్రభాగాన ఉందని కేకే కితాబునిచ్చారు. పలువురు టీకాంక్షిగెస్ ఎంపీలు జగన్ గూటికి చేరుతున్నారన్న వదంతులను నిర్దంద్వంగా కొట్టిపారేశారు. ఆ పార్టీలో చేరడం అవివేకమే అవుతుందని స్పష్టంచేశారు. అంతకుముందు తనతో భేటీ అయిన కేకేతో మాట్లాడిన కేసీఆర్.. తెలంగాణకోసం టీ కాంగ్రెస్ నేతలు ఫ్రంట్ ఏర్పాటు చేస్తే అది సీమాంధ్ర నేతలకే లాభం చేకూరుస్తుందని అప్రమత్తం చేసినట్లు తెలిసింది.

తెలంగాణవాదులంతా ఒకే వేదికపై ఉండాలన్న కేసీఆర్.. వారంతా టీఆర్‌ఎస్ బ్యానర్ కిందికి వస్తేనే సీమాంవూధులు మనల్ని చీల్చేందుకు కుట్రలుపన్నేఆస్కారం ఉండదని చెప్పారని సమాచారం. కాంగ్రెస్, టీడీపీలోని తెలంగాణవాదులకు డబ్బు, పదవులు ఎర చూపి వారిని చీల్చేందుకు జగన్ పార్టీ కుట్రలు చేస్తున్నారని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్ చెప్పారని తెలిసింది. ఇదిలావుండగా.. శ్రీనివాస్‌గౌడ్‌తోకలిసి కేసీఆర్‌తో భేటీ అయిన కోదండరాం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వచ్చేవారం ఉద్యమ రోడ్‌మ్యాప్ రూపొందిస్తామని చెప్పారు. ఇకపై మరింత ఉధృతంగా తెలంగాణ పోరాటం సాగబోతున్నదని తెలిపారు. ఉద్యమం సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉంటుందని చెప్పారు. అంతకుముందు అంతర్గతంగా సాగిన భేటీలో కోదండరాంతో మాట్లాడిన కేసీఆర్.. ఇప్పటిదాకా ఎంతో కష్టపడ్డామని, మరికాస్త కష్టపడితే ఫలితం వస్తుందని చెప్పినట్లు తెలిసింది. డిసెంబర్ 1న జరిగే టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో డిసెంబర్ 9, 23 తేదీల్లో ఏం చేయాలన్నదానిపై వ్యూహ రచన చేయనున్నట్లు సమాచారం.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.