ఉద్యమం మళ్లీవస్తే ఆపడం తరంకాదు:హరగోపాల్

వరంగల్: తెలంగాణ ఉద్యమం మరోసారి గనుక వస్తే ఆపడం ఎవరితరంకాదని సామాజికవేత్త ప్రొఫెసర్ హరగోపాల్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన కాకతీయ వర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ కే జయశంకర్ జయంతుత్సవాల్లో మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులు వాళ్ల సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను హరగోపాల్ సమర్థించారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలని సీమాంధ్రులు పట్టుబట్టడం తగదని ఆయన హితవు పలికారు. ఇప్పటికైనా సీమాంధ్ర నేతలు రాష్ట్ర విభజనకు సహకరించాలని ఆయన కోరారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.