ఉద్యమం ఉప్పెన

నిప్పులమీద నడిచింది తెలంగాణ, సాయుధపోరు స్పూర్థిని ఆవాహన చేసుకుని అడుగులేసింది తెలంగాణ. అరవైఏళ్ల కల సాకారం చేసుకోవడం వెనక ఎంత ఆర్తి, ఎంత ఆవేదన, హింస. పళ్లబిగువున అన్నీ భరించి అడుగు అడుగు వేసి గమ్యం ముద్దాడింది. ఈ ప్రస్థానంలో ఎన్నెన్నో ఘట్టాలు, నెత్తురు ఉడికించినవి, కుమిలి కుప్పగూలినవి, అగ్నిపరీక్షకు నిలిచినవి. అగ్నికి ఆహుతి చేసుకున్నవి. ప్రతి సన్నివేశం సందర్భం చారిత్రక ఘటనలే.
srikanth.jpgగైర్ ముల్కీల మీద పిడికిలెత్తి సిటీ కాలేజి దగ్గర ఒరిగిపోయిన విద్యార్థులు బీజం వేసిన ఉద్యమం ఇంతింతై వటుడింతై అన్నట్టు ఉస్మానియాను యుద్ధభూమిగా మార్చిన వైనం.. నాన్‌లోకల్ ఉద్యోగుల మొగలాయీ పాలనపై తిరగబడి సమ్మె కట్టిన నాటి నుంచి నేటి సకల జనుల సమ్మెదాకా ఎత్తిన పిడికిలి ఏనాడూ దింపకుండా స్వరాష్ట్రకల సాకారం చేసుకునే దాకా ఉద్యోగులు సాగించిన సమరం ..
yadayyah.jpg ఒక్క పిలుపు వచ్చినా చీమల బారులా లక్షలమందిగా తరలి వచ్చిన జనం సృష్టించిన ప్రభంజనాలు.. తాము నిప్పుల్లో కాలి తెలంగాణను అగ్నిపునీతను చేసిన యువత ఆత్మత్యాగాలు.. అనువైన సందర్భంగా జెండాలు విసిరి చేతులు కలిపిన నేతల ఆదర్శ మార్గం.. గాయకులు, కళాకారులు, సాహితీ వేత్తలు, పాత్రికేయులు మొత్తంగా సకలజనులు ఉద్యమ పథాన అడుగుడుగడునా ప్రదర్శించిన విశ్వరూప ప్రకటనలు అన్నీ చిరస్మరణీయాలే.
full.jpg
నా కల నెరవేరింది
నా కల నెరవేరింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటికి వెళుతున్నా. తెలంగాణ రాష్ట్రం అమరవీరులకు అంకితం. తెలంగాణ కోసం జరిగిన రెండు ఉద్యమాలలో పాల్గొనే అదృష్టం కల్పించిన నాగర్‌కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు, మహబూబ్‌నగర్, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. 2006లో జాతీయ కార్యావర్గం తీర్మానం చేసిన బీజేపీ, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చింది. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్ర ఏర్పాటును సుగమం చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్, అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీకి కృతజ్ఞతలు.
-నాగం జనార్దన్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే

This entry was posted in ARTICLES, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.