ఉద్యమంపై విషం చిమ్ముతున్న ఏబీఎన్ :టీఆర్‌ఎస్

హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయడానికి కంకణం కట్టుకున్న ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఉద్యమపార్టీ టీఆర్‌ఎస్‌పై తన విషపు కోరలైన ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికతో విషం చిమ్ముతున్నాడని టీఆర్‌ఎస్ పార్టీ ఆరోపించింది. అసలు రాధాకృష్ణ నీచపు దొంగ బతుకు నిజామాబాద్ జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారని టీఆర్‌ఎస్ శాసనసభ్యులు కొప్పుల ఈశ్వర్, ఏనుగు రవీందర్‌రెడ్డి, నల్లాల ఓదేలు తీవ్రంగా మండిపడ్డారు. రిపోర్టర్లతో బ్లాక్‌మెయిల్ చేయించిన నీచమైన చరిత్ర రాధాకృష్ణదని, ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత రామనాయుడును అడిగిన చెబుతాడన్నారు.

రాధాకృష్ణ బతుకే పెంటకుప్పలపై ఈగల కన్నా నీచమైన బతుకు అని వారు ధ్వజమెత్తారు. ఉద్యమాన్ని నడిపించేవాళ్లను మాఫియా డాన్‌లు, సెటిల్‌మెంట్ డాన్‌లుగా చిత్రీకరించే కుట్రలో భాగమే కేటీఆర్‌పై ఈ రోజు ఏబీఎన్ టీవీ ఛానాల్‌లో గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు. ఈ వ్యవహారంపై పరువు నష్టం వేయనున్నట్లు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.

తెలంగాణ ఉద్యమంపై నీచమైన ప్రచారం చేస్తున్న ఏబీఎన్, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ రహస్య ఎజెండా ఎంటో తెలంగాణ ప్రజలకు తెలుసన్నారు. ఇప్పటికైన తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులపై, ఉద్యమపార్టీపై విషం చిమ్మడం రాధాకృష్ణ మానుకోకపోతే రేపు తల బద్దలు కొట్టుకున్న లాభం లేని రోజు వస్తుందని హెచ్చరించారు. ఏం చూసుకోని బరితేగిస్తున్న రాధాకృష్ణ ఇంకెన్నో రోజులు తన పప్పులు ఉడకవని గ్రహించాలన్నారు.

తెలంగాణ ఉద్యమంపై తన వికృత రాతలతో, శాడిస్టు మనసత్వంతో ఉన్న రాధాకృష్ణ తన పిచ్చి చేష్టలు మానుకోకపోతే గతంలో మందకృష్ణ మాదిగ ఏ విధంగ బుద్ది చెప్పాడో తెలంగాణ వాదులు అదే విధంగా బుద్ది చెబుతారని రాజకీయ విశ్లేకులు వి. ప్రకాశ్ హెచ్చరించారు. ఈ టక్కూ టమార విద్యాలకు తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, టీఆర్‌ఎస్ పార్టీ బెదరదని టీఆర్‌ఎస్‌వీ అధ్యక్షుడు బాల్క సుమన్ హెచ్చరించారు.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.