ఉద్ధవ్ ఠాక్రేతో మోడీ భేటీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంవూదమోడీ శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార కన్వీనర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత గురువారం తొలిసారి ముంబైకి వచ్చిన మోడీ.. బాంద్రాలోని ఉద్ధవ్ ఠాక్రే నివాసమైన మాతోశ్రీకి వచ్చారు. మోడీ వెంట బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నావిస్, మండలి బీజేపీ పక్షనాయకుడు వినోద్ తావ్డే, ముంబై బీజేపీ అధ్యక్షుడు అశిష్ షెల్కర్ ఉన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలు తెలియరాలేదు. కాగా, మంగళవారం శివసేన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో.. రాంబోలా మోడీ ఒక్కరే వేలాది మందిని రక్షించినట్లు ప్రచారం చేసుకోవడంపై తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.