ఉత్తర భారతదేశంలోనూ స్వల్ప భూప్రకంపనలు

న్యూఢిల్లీ : ఉత్తర భారతదేశంలోనూ మంగళవారం మధ్యాహ్నం స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 20 సెకన్ల పాటు భూమి కంపించింది. ఉత్తర భారతంలో భూకంప తీవ్రత 4.6గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనాలు భయంతో పరుగులు తీశారు. ఢిల్లీ, నోయిడా, ఛండీగఢ్, అహ్మదాబాద్, సూరత్‌లలో భూమి స్వల్పంగా కంపించింది.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.