ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వామిగౌడ్: కేసీఆర్


swamy17హైదరాబాద్: ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా టీఎన్జీవోల మాజీ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇవాళ స్వామిగౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా స్వామిగౌడ్‌ను భారీ మెజారిటితో గెలిపించుకోవాలని ఆయన పార్టీ శ్రేణులకు, పట్టభద్రులకు పిలుపునిచ్చారు. స్వామిగౌడ్ భారీ మెజారిటితో గెలుస్తారనే నమ్మకం తనకుందని కేసీఆర్ అన్నారు. స్వామిగౌడ్‌ను టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడుగా కూడా నియమిస్తున్నట్టు ఆయన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే తెలంగాణలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో స్వామిగౌడ్‌కు కార్మిక, ఉపాధి శాఖ మంత్రి పదవిని కేటాయిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్న నారదాసు లక్ష్మణరావు కూడా తనను ఎన్నడూ ఎమ్మెల్సీ పదవి కావాలని అడగలేదని, తానే పిలిచి ఎమ్మెల్సీగా సీటు ఇచ్చి గెలిపించానని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొనే ప్రతి ఒకరికి ప్రాధాన్యత ఉంటుందని కేసీఆర్ ప్రకటించారు.

 

This entry was posted in CRIME NEWS, TELANGANA NEWS, Top Stories.

Comments are closed.