ఉత్తరాఖండ్ మృతులు..5000పైనే పదివేల మంది జాడే లేదు

 

army-ఉపశమనం లేని వరద బాధితులు
-వర్షంతో సహాయ చర్యలకు ఆటంకం
-తెరపినివ్వడంతో మరో పదివేల మంది తరలింపు
-నేడు మళ్లీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక
-ఇంకో పదివేల మందికిపైగా ఎదురుచూపులు
-వర్షాలు కురిస్తే మరింత ప్రమాదం

ప్రాణాలను కూడగట్టుకున్నా.. మాట్లాడే ఓపిక లేక.. నిర్విరాకార చూపులతో మరికొందరు.. శవాల మాదిరిగా పడున్న ఇంకొందరు.. శవాలుగా మారిన.. మారుతున్న.. మరికొందరు.. వారి మాటలన్నీ నేరుగా మనకు వినిపించకపోవచ్చు.. ఆ దృశ్యాలన్నీ మనకు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు.. కానీ.. కళ్లు మూసుకుని.. ఆ పరిస్థితిని ఒకసారి ఊహించుకుంటే.. మనసు కదిలిపోతుంది. వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో యాత్రికుల అవస్థలు వర్ణనాతీతం. ఎక్కడెక్కడివారో.. కులాలు, రాష్ట్రాలు, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా.. పుణ్యక్షేవూతాల్లో దైవ దర్శనాల కోసం బయలుదేరారు. ప్రకృతి బీభత్సానికి అతలాకుతలమయ్యారు.
తెగిపోయిన రోడ్లు, విరిగిపడిన కొండ చరియల నడుమ.. తినడానికి తిండి సంగతి అటుంచి ప్రాణాలను నిలబెట్టుకోవడానికి మంచినీళ్లు కూడా అందక పసిపిల్లలు సహా ఎందందరో చనిపోతుంటే.. అయ్యో దేవుడా.. ఏమిటీ పరిస్థితి? అని వారంతా అలమటిస్తున్నారు. స్వర్గాన్ని తలపించేలా త్రిశంకు స్వర్గాన్ని సృష్టించారని అంటుంటారు. అది నిజ మో కాదో లేదో తెలియదుకానీ ఇప్పుడు బాధితుల పరిస్థితి మాత్రం త్రిశంకు నరకంలా ఉందని భావించవచ్చు. వరదల విలయానికి గురయిన ఉత్తరాఖండ్‌లో మృతుల సంఖ్య 5వేలు దాటొచ్చని విపత్తు నివారణ మంత్రి యశ్‌పాల్ ఆర్య అభివూపాయపడ్డారు. కచ్చితమైన సంఖ్య ఇప్పుడే చెప్పలేమని, టన్నుల కొద్ది భారీ శిథిలాల కింద చాలామందే ఉండొచ్చని చెప్పారు. వరద బాధిత ప్రాంతాల్లో ఆయన ఆదివారం ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం జోలీక్షిగాంట్ విమానాక్షిశయంలో విలేకరులతో మాట్లాడారు. పరిస్థితి తీవ్రంగా ఉందని, భారీ శిథిలాల కింద ఎందరున్నారనేది అంతుపట్టడం లేదన్నారు. ఆదివారం పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

వర్షం కారణంగా సహాయక చర్యలకు రెండుసార్లు ఆటంకం కలిగింది. మూడువేల మంది బాధితులను రక్షించామని, మరో ఏడువేల మందిని తరలించగలమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పారు. ప్రకృతి బీభత్సానికి 680 మంది చనిపోయినట్లు అధికారులు పేర్కొనగా, మృతుల సంఖ్య 1000దాటవచ్చని ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ అన్నారు. సహాయక చర్యలు పూర్తయ్యేందుకు మరో రెండు వారాల సమయం పట్టవచ్చన్నారు. ఇప్పటివరకు మొత్తం 80వేల మందిని రక్షించామని, వివిధ ప్రాంతాల్లో మరో పదివేల మంది వరకు ఉండొచ్చని ఢిల్లీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డీజీ నీలంకపూర్ చెప్పారు. ఇప్పటికే భూమి తడిసిపోయి ఉన్నందున కొండ చరియలు విరిగిపడుతున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్), ఇండో టిబెట్ సరిహద్దు పోలీసు (ఐటీబీపీ) సహా సైన్యంలోని వివిధ విభాగాలు రంగంలోకి దిగినా బాధితులకు, వారి సంబంధీకులకు ఆశించినంత ఊరట లభించడం లేదు.

శనివారం గౌరీకుండ్, రాంబరా మధ్య జంగిల్ చత్తిలో చిక్కుకుపోయినట్లు కనుగొన్న మొత్తం 550 మందిని రక్షించినట్లు సహాయ బృందాలు ప్రకటించాయి. హార్సిల్ నుంచి 450 మందిని కాపాడామని, అక్కడ ఇంకా 1500 మంది ఉన్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. బద్రీనాథ్‌లో 5వేల మంది చిక్కుకుని ఉన్నారు. ఇంకా పితోరాగఢ్, బర్కోట్, హేమకుంద్ సాహిబ్ తదితర ప్రాంతాల్లో పలువురు బాధితులు కాపాడేవారికోసం ఎదురుచూస్తున్నారు. మృతుల సంఖ్య 600లోపేనని అధికారిక లెక్కలు పేర్కొంటుండగా, కేదార్‌నాథ్ వద్ద మరో 123 మృతదేహాలను కనుగొనడంతో ఆ సంఖ్య 680కి చేరిందని ఓ అంచనా. భారత వైమానిక దళం రెండొందలసార్లకుపైగా హెలికాప్టర్లను తిప్పిందని, రెండువేల మందికిపైగా తరలించిందని, 20వేల కిలోల పరికరాలను, సహాయసామక్షిగిని జారవిడిచిందని ఓ సైనికాధికారి వెల్లడించారు. సోమవారం నుంచి ఓ మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో సహాయ చర్యలను ముమ్మరం చేసినట్లు అధికారులు తెలిపారు.

ద్రీనాథ్ వద్ద చిక్కుకుపోయిన యాత్రికులను తరలించేందుకు 50 కిలోమీటర్ల మేర వంతెనలను ఏర్పాటుచేస్తున్నామని ఐటీబీపీ డీఐజీ అమిత్‌వూపసాద్ ఆదివారం గౌచార్ వద్ద విలేకరులకు చెప్పారు. వాతావరణ ప్రతికూలతలను అధిగమించేందుకు సుమారు రెండొందల మంది జవాన్లను ఇందుకు వినియోగిస్తున్నట్లు తెలిపారు. కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఉన్న హిమాలయ ప్రాంతాల్లోని రుద్రవూపయా గ, చమోలి, ఉత్తరకాశి జిల్లాల నుంచి ఇప్పటివరకు 80వేల మందిని తరలించినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. డెహ్రాడూన్, జోషిమఠ్‌లో ఆదివారం ఉదయం వర్షం కారణంగా సహాయకార్యక్షికమాలకు కొద్దిసేపు ఆటంకం కలిగింది. సైన్యం, హెలికాప్టర్లతో సహాయచర్యలు కొనసాగిస్తున్నా సోమవారం వర్షాలు కురిస్తే మరింత ప్రమాదమనే ఆందోళన వ్యక్తమవుతోంది. అంతటా ఉత్కంఠ నెలకొంది..
కేంద్రం దీర్ఘకాలిక ప్రణాళిక: ఉత్తరాఖండ్‌లో తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి కేంద్రం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలనుకుంటోంది. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం ఉత్తరాఖండ్ ప్రజలకు సంఘీభావంగా నిలుస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ అధ్యక్షురాలి కార్యాలయం ఇన్‌చార్జి అయిన అంబికాసోనీ అన్నారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఆదివారం ఆమె డెహ్రాడూన్‌కు వచ్చారు.

పాపం.. యాత్రికులు
‘అమ్మా చూడాలి.. నిన్నూ నాన్నను చూడాలి..
నాన్నకు ముద్దులు ఇవ్వాలి..
నీ ఒడిలో నిద్దురపోవాలి.. అమ్మా.. అమ్మా..’
హృదయాలను ద్రవింపజేసే ఆర్తి.. దశాబ్దాల కిందట తెలుగులో వచ్చిన ‘పాపం పసివాడు’ చిత్రంలోని పాట ఇది. అంతుతెలియని ఎడారిలో చిక్కుకుపోయి అమ్మానాన్నల కోసం అలమటించే ఓ చిన్నారి ఆవేదన అది. ఇప్పుడు.. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకుపోయిన వేలమంది నిస్సహాయుల పరిస్థితీ అలాంటిదే.

తీర్థయావూతలకోసం బయలుదేరి అనుకోనివిధంగా ఆపదలో కూరుకుపోయిన తమను ఎవరు ఎప్పుడు ఏ విధంగా రక్షిస్తారో అని ప్రాణాలరచేత పట్టుకుని ఎదురుచూస్తున్నారు. కళ్లముందే ఎందరో బలయిపోతుంటే.. చుట్టూ శవాల నడుమ జాగరణ చేస్తూ.. ఎప్పటికైనా తాము బతికి బయటపడతామా?.. లేక అర్ధాంతరంగానే.. దిక్కులేని చావు చస్తామా అని ఆందోళనకు లోనవుతున్నారు. దైవ దర్శనాల కోసం పుణ్యక్షేవూతాలకు వచ్చిన తమను ఏ దేవుడు రక్షిస్తాడోనని ప్రార్థిస్తున్నారు. సైన్యంలోని వివిధ విభాగాలను రంగంలోకి దింపినా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నా వెంటనే అందరి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నాయి. కనిపించినవారినందరిని కూడా తరలించలేకపోతున్నాయి.. ప్రపంచమంతా చూస్తుండగానే.. విషాదం కొనసాగుతోంది.. ఇది మహా విషాదం.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.