గుర్తించిన కేంద్ర ప్రభుత్వం..పర్యాటకంగా మరింత అభివృద్ధి
దేశంలో ఉత్తమ వారసత్వ నగరంగా వరంగల్‌కు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించిం ది. వేల ఏళ్ల చారివూతక సంప ద, వారసత్వ చరిత్ర ఘనం గా ఉన్న వరంగల్‌కు ఈ గుర్తింపు పర్యాటకంగా మరింత ప్రాధాన్యత చేకూర్చనుంది. జిల్లాలో కాకతీయుల కట్టడాలైన రామప్ప, ఖిలావరంగల్, వేయిస్తంభాల దేవాలయం, ఘనపురం కోటగు ళ్లు, చరివూత మణిమకుటంగా ఉన్నా యి. ఇంత గొప్ప సంపద ఉన్నా ఇన్నాళ్లూ అంతర్జాతీయ స్థాయి గుర్తింపునకు నోచుకోలేదు. తాజాగా జిల్లాకు వారసత్వ నగరంగా గుర్తింపు రావడం వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
యునెస్కో గుర్తింపు కూడా వచ్చే అర్హతలు అన్నీ ఉన్నప్పటికీ అంతర్జాతీయ స్థాయికి ఓరుగల్లును పరిచయం చేయడంలో ప్రజావూపతినిధులు విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. కాకతీయ ఉత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో యునెస్కో గుర్తింపునకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. రానున్న రోజు ల్లో జిల్లాకు విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పర్యాటక శాఖ భావిస్తోంది. వారసత్వ నగరంగా గుర్తించడంపై చరిత్ర నిపుణులు, ఇన్టాక్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, వరంగల్ నగర అభివృద్ధి సంస్థ, రాష్ట్ర పర్యాటకశాక, రాష్ట్ర పురావస్తు శాఖ తప్పనిసరిగా బడ్జెట్లను కేటాయించాల్సి ఉంటుంది.