ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు జవాన్లుమృతి

జమ్మూకశ్మీర్ : శ్రీనగర్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు ఆర్మీ జవాన్లు మృతి చెందారు. మరో ఏడుగురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ప్రధాని మన్మోహన్‌సింగ్ రేపు శ్రీనగర్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హల్దోవర్ ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జవాన్లపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.