ఉక్కు…. హక్కు మాదే

 
trsbayaram
ఖనిజాన్ని తరలిస్తే ఊరుకోబోమన్న టీఆర్‌ఎస్
– స్థానికంగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్
– మండల కేంద్రాల్లో వెల్లు నిరసనలు
– టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ బైక్ ర్యాలీ, రాస్తారోకో
– ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనం
విశాఖ స్టీల్స్‌కు బయ్యారం ఇనుప గనులను కేటాయిపును రద్దు చేయాలని టీఆర్‌ఎస్ నినదించింది. మంగళవారం తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో టీఆర్‌ఎస్ శ్రేణులు నిరసన కార్యక్షికమాలు చేపట్టాయి. బయ్యారం ఉక్కు.. తెలంగాణ హక్కు అని, స్థానికంగానే స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. టీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వ, సీఎం దిష్టిబొమ్మలను దహనం చేశారు. తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపవూతాలు
అందజేశారు.

ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా
ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించారు. కొత్తగూడెంలో టీఆర్‌ఎస్ స్రీఎం కిరణ్ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. పాల్వంచలో ఆర్డీ వో కార్యాలయం ఎదుట ధర్నా, నేలకొండపల్లి, కూసుమంచి, తిరుమలాయపాలెం, సత్తుపల్లి, చండ్రుగొండ, ముల్కలపల్లిల్లో ప్రదర్శనలు, తహసీల్దారుకు వినతిపత్రం అందించారు. ఇల్లెందులో టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్ ఆధ్వర్యంలో ప్రదర్శన చేపట్టారు. వరంగల్ జిల్లా జనగామ డివిజన్ లోని బచ్చన్నపేటలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అన్ని నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్షికమాలు నిర్వహించారు. కార్యక్షికమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, పొలిట్‌బ్యూరో సభ్యులు పెద్ది సుదర్శన్‌డ్డి, సిరికొండ మధుసూదనాచారి తదితరులు పాల్గొన్నారు.

బాబుకు ప్రేమ ఉంటే తరలింపును ఆపాలి
కరీంనగర్ మండలం బొమ్మకల్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకడ్డి పాల్గొన్నారు. టీడీపీ నేతలు బయ్యారంలో ఆందోళన నిర్వహించడంపై మాజీ ఎంపీ వినోద్ మండిపడ్డారు. నిజంగానే చంద్రబాబుకు తెలంగాణపై ప్రేమ ఉంటే ప్రతిపక్ష నేత హోదాలో బయ్యా రం ఉక్కు తరలిపోకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. తట్టెడు ఖనిజాన్ని కూడ తరలనివ్వబోమని ఈద శంకర్‌డ్డి తేల్చిచెప్పారు. చొప్పదండిలో బొడిగ శోభ ,తిమ్మాపూర్‌లో ఓరుగంటి ఆనంద్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. రామడుగులో బైక్ ర్యాలీ, గంగాధరలో ప్రభు త్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బోయినపల్లి, మానకొండూరులో ర్యాలీ, దిష్టిబొమ్మ దహనం చేశారు. వెల్గటూరు, ధర్మారంలో రాస్తారోకో, చిగురుమామిడిలో ధర్నా, దీక్ష చేపట్టారు. సిరిసిల్ల, వేములవాడ, చందుర్తి, కోనరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, ఎల్లాడ్డిపేట మండల కేంద్రాల్లో ధర్నాలు, మంథనిలో ధర్నా చేశారు. పెద్దపల్లి, గోదావరిఖనిలో ప్రదర్శన నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లా అంతటా మండల కేంద్రాల్లో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట, ముఖ్య కూడళ్లలో ధర్నా చేశారు. నల్లగొండ గడియారం సెంటర్ వద్ద టీఆర్‌ఎస్వీ నాయకులు రాస్తారోకో చేశారు. కట్టంగూరులో ర్యాలీ,నారాయణపురంలో రాస్తారోకో, మునుగోడులో సీఎం దిష్టిబొమ్మ దహ నం, కూసుకుంట్ల ప్రభాకర్‌డ్డి ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన ర్యాలీ చేపట్టారు. రంగాడ్డి జిల్లా సాగర్ రహదారిపై రాస్తారోకో, సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్, మహేశ్వరంలో ర్యాలీ, తహసీల్దార్లకు వినతిపత్రం, మేడ్చల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొందుర్గులో శ్రీధర్‌డ్డి ఆధ్వర్యంలో ర్యాలీ, సీఎం దిష్టిబొమ్మ దహనం, ఫరూఖ్‌నగర్‌లో వెంకట్‌రాండ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. నాగర్‌కర్నూల్, నారాయణపేట, కల్వకుర్తిలో బైక్ ర్యాలీ, భూత్పూర్‌లో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.