ఉక్కు కోసం కదంతొక్కిన టీఆర్ఎస్‌

బయ్యారం ఉక్కు తెలంగాణకే దక్కాలి
-స్థానికంగానే స్టీల్ ఫ్కాక్టరీ ఏర్పాటు చేయాలి
-కేంద్రంపై టీ కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి తేవాలి
-విశాఖకు గనుల కేటాయింపు జీవో రద్దు చేయాలి
– కలెక్టరేట్ల ఎదుట ధర్నాలో టీఆర్‌ఎస్ డిమాండ్
బయ్యారం ఉక్కు తెలంగాణకే దక్కాలని, ఖనిజ సంపద గడపదాటి పోతుంటే చూస్తూ ఊరుకోబోమని, ఇక్కడే ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాలని గులాబీదండు డిమాండ్ చేసింది. పార్టీ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు శుక్రవారం టీఆర్‌ఎస్ శ్రేణులు తెలంగాణవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట మహాధర్నా నిర్వహించాయి. ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రంపై టీ ఎంపీలు ఒత్తిడి పెంచాలని కోరారు. బయ్యారం గనుల ను విశాఖ ఉక్కుకు కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం నుంచి ఒక్కరాయిని తరలించినా సహించేదిలేదని హెచ్చరించారు.

సహజవనరులు లూటీ
సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజల నోట్లో మన్నుకొట్టి సహజ వనరులను లూటీ చేయాలని చూస్తున్నారని ఖ మ్మం కలెక్టరేట్ ఎదుట ధర్నాలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరామారావు మండిపడ్డారు. టీఆర్‌ఎస్ జిల్లా కన్వీనర్ దిండిగాల రాజేందర్ పాల్గొన్నారు.‘బయ్యారం నీ తాత జాగీరు కాదు, మర్యాదగా జీవో వాపస్‌తీసుకో.అహంకారంతో ఉంటే నీ భరతం పట్టడం ఖా యం’ అని సీఎం కిరణ్‌ను కరీంనగర్ ధర్నాలో టీఆర్‌ఎస్‌ఎల్పీనేత ఈటెల రాజేందర్ హెచ్చరించారు. విశాఖ స్టీల్స్ లో మా వాటా ప్రకారం 14వేల ఉద్యోగులుండాలి, కనీసం 140 మంది ఉన్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని, లేకుంటే రాస్తావా అని సీఎంకు సవాల్ విసిరారు. ధర్నాలో జిల్లా అధ్యక్షుడు ఈద శంకడ్డి, ఎమ్మెల్యేలు కమలాక ర్, ఈశ్వర్,కే విద్యాసాగర్‌రావు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, సత్యనారాయణడ్డి, రసమయి బాలకిషన్ పాల్గొన్నారు.

తట్టెడు ఖనిజాన్ని కూడా తరలనివ్వం
‘సీఎం అహంకారపూరితంగా మాట్లాడుతున్నాడు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బయ్యారం నుంచి ఇనుప ఖనిజా న్ని తరలించుకుపోతామని భేషజాలకు పోతున్నాడు. రక్తపు పారినా సరే బయ్యారం నుంచి తట్టెడు ఇనుప ఖనిజాన్ని తరలినివ్వం’ అని వరంగల్‌లో నిర్వహించిన ధర్నాలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు హెచ్చరించారు. ధర్నాలో ఎమ్మెల్యేలు వినయభాస్కర్, రాజయ్య, భిక్షపతి, మధుసూదనాచారి పాల్గొన్నారు. మెదక్ జిల్లా సంగాడ్డి ధర్నాలో జిల్లా ఇన్‌చార్జ్ రాజయ్యయాదవ్ మాట్లాడుతూ తెలంగాణ నిధులన్నీ దోచుకున్న సీమాంవూధులు ఆఖరుగా మన ఉక్కును దోచుకోవాలని కుట్రలు చేస్తున్నారన్నారు. ధర్నాలో దేశపతి శ్రీనివాస్,ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌డ్డి, రామలింగాడ్డి పాల్గొన్నారు. బయ్యారం గనులను సింగరేణికి ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల ధర్నాలో ఎమ్మెల్యే నల్లాల ఓదెలు డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట, మంచిర్యాల ధర్నాలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, జిల్లా అధ్యక్షులు లోక భూమాడ్డి, శ్రీహరిరావు, ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

గనులను కాపాడుకుంటాం
భూకంపం సృష్టించైనా బయ్యారం గనులను కాపాడుకుంటామని నల్లగొండ కటెక్టరేట్ వద్ద ధర్నాలో టీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గుంటకండ్ల జగదీశ్వర్‌డ్డి చెప్పారు. చెరుకు సుధాకర్, కర్నె ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌డ్డి పాల్గొన్నారు. బయ్యారం ఉక్కును ఆంధ్రాకు తరలిస్తే తెలంగాణ జిల్లాలు రణరంగంగా మారతాయని పాలమూరు ధర్నా లో పాలిట్‌బ్యూరో సభ్యులు జితేందర్‌డ్డి, ఇబ్రహీం, బెక్కెం జనార్దన్ హెచ్చరించారు. సీమాంధ్ర దోపిడీని అడ్డుకునేందుకు రాష్ట్ర ఏర్పాటే శరణ్యమని రంగాడ్డి జిల్లా వికారాబాద్ ధర్నాలో టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు ఏ చంద్రశేఖర్ పేర్కొన్నారు.

నాయిని సహా 300 మంది అరెస్టు
బయ్యారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ హైదరాబాద్ కలెక్టరేట్ ఎదుట టీఆర్‌ఎస్ ధర్నా చేసింది. ధర్నాలో గ్రేటర్ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్సీ మహమూద్‌అలీ, పొలిట్‌బ్యూరో సభ్యుడు నాయిని నర్సింహాడ్డి, గ్రేటర్ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్, బొంతు రాంమోహన్, బాల్క సుమన్ పాల్గొన్నారు. బయ్యారం ఉక్కును సాధించుకొని తీరుతామని నిజామాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు గంగాడ్డి పేర్కొన్నారు.

This entry was posted in TELANGANA NEWS, Top Stories.

Comments are closed.