ఉక్కుపాదం తుక్కు తుక్కు

kodanda-నిలిచి గెలిచిన తెలంగాణ
-సీమాంధ్ర సర్కారుకు గర్వభంగం
-రణరంగమైన హైదరాబాద్ నగరం
-నిర్బంధ వలయాన్ని ఛేదించిన ఉద్యమకారుల బృందాలు

– పాదరసంలా మారి.. పోలీసులకు చెమటలు పట్టించిన కార్యకర్తలు
– జిల్లాల నుంచి అసంఖ్యాకంగా నగరానికి చేరిన ఉద్యమకారులు
– తొలి ఉరుము.. విద్యార్థి శక్తులదే.. నాలుగు దిశల నుంచి అసెంబ్లీ ముట్టడి
– అడ్డుకునేందుకు ఖాకీల అత్యుత్సాహం.. ఇందిరాపార్క్ పరిసరాల్లో రణరంగం

– సభలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన
– బయట సర్కారు దిష్టిబొమ్మ దహనం.. అరెస్ట్
– కలకలం రేపిన వినయభాస్కర్, సమ్మయ్య
– నల్లజెండాలతో టీఆర్‌ఎస్‌ఎల్పీ భవనంపైకి
– కోదండరాం సహా వందల మంది అరెస్ట్
– అరెస్టుల్లో పోలీసుల అరాచకం

KAVITHA-ARRESTఒక మిలియన్ మార్చ్.. ఒక సాగరహారం.. ఒక సడక్ బంద్! తెలంగాణ మలి దశ ఉద్యమాల్లో అపూర్వ విజయాన్ని సాధించిన మైలు రాళ్లు! మరోసారి సీమాంధ్ర సర్కారుకు గర్వభంగం చేస్తూ.. ఇప్పుడు చలో అసెంబ్లీ! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను దిగంతాలకు చాటి చెబుతూ.. తెలంగాణ ఉద్యమకారులు.. రాజధాని నడిబొడ్డున వేసిన పోరుకేక! బారికేడ్లు.. ముళ్ల కంచెలు.. వాటికి కాపలాగా వేలాది సాయుధ బలగాలు.. కరకు బూట్ల కవాతులు.. రాజధానికి ప్రజలు రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధంతో అసెంబ్లీని తానే ముట్టడించుకున్న సర్కారు.. తెలంగాణ జేఏసీ ఇచ్చిన చలో అసెంబ్లీ పిలుపును 24 గంటల ముందే విజయవంతం చేసింది! ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి.. పొద్దుపొడవక ముందే అసెంబ్లీకి చేరుకోవడం ద్వారా ప్రభుత్వ ఓటమిని సూర్యోదయానికి ముందే అంగీకరించినట్లయింది. కనీవినీ ఎరుగని నిర్బంధాన్ని అధిగమించిన ఉద్యమకారులు.. అరెస్టులు, బైండోవర్లకు చిక్కని ఆందోళనకారులు.. ఉద్యమానికి మార్గనిర్దేశం చేసిన నాయకులు.. లాఠీదెబ్బలు తిని.. బాష్పవాయు గోళాలు ఎదుర్కొని.. చలో అసెంబ్లీ విజయవంతాన్ని స్ఫూర్తిదాయకంగా పరిపూర్తి చేశారు.

టీజేఏసీ పిలుపు మేరకు జరిగిన చలో అసెంబ్లీ కార్యక్షికమం దిగ్విజయంగా ముగిసింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎంతటి బలమైనదో.. పాలకులకు మరోసారి వినిపించింది. ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తూ సర్కారు వదిలిన లాఠీలు.. బాష్పవాయు తూటాలు ఉద్యమకారులను ఆపలేకపోయాయి.

VIJAYASHANTHI-ARRESTజిల్లాల్లో 20వేల మందిని నిర్బంధించినా.. అనేక కష్టనష్టాలకోర్చి రాజధానికి వచ్చినవారు.. అప్పటికే వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నవారు.. హైదరాబాద్‌లోని తెలంగాణవాదులు.. సర్కారు ఎత్తులను చిత్తు చేశారు. ఒకరిని అరెస్టు చేస్తే మరొకరు.. ఒక బృందాన్ని అదుపులోకి తీసుకుంటే మరో బృందం! లక్ష్యం ఒకటే.. ఏదో ఒక మార్గంలో అసెంబ్లీని చేరుకోవాలి.. తెలంగాణ ఆకాంక్షను ఎలుగెత్తి చాటాలి.. నిర్బంధాలు.. నిషేధాజ్ఞలు.. నిరంకుశత్వాలు ఆత్మ గౌరవ నినాదం ముందు నిలువజాలవని నిరూపించాలి! ఆ లక్ష్యాన్ని ఉద్యమకారులు సాధించారు. పురుగుకూడా ప్రవేశించడానికి వీల్లేకుండా ఏర్పాటు చేసిన పటిష్టమైన భద్రతా వలయాన్ని ఛేదించి.. సీమాంధ్ర సర్కారుకు సవాలు విసిరారు. నిర్మానుష్యంగా ఉన్న అసెంబ్లీ వద్దకు ఒక్కో బృందం సైనిక దళాల్లా.. మెరుపులా ప్రత్యక్షమై.. జై తెలంగాణ అంటూ ఉరిమారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ వారిని అనుసరిస్తూ.. ఆంక్షలు లెక్క చేయకుండా అనేక మంది అసెంబ్లీవైపు కదం తొక్కారు.

స్ఫూర్తి ఉద్యమాలకు పెట్టింది పేరైన తెలంగాణ విద్యార్థులు.. చలో అసెంబ్లీ కార్యక్షికమానికి నాందిపలికారు. ఉదయం ఎనిమిది గంటలకే.. సాక్షాత్తూ డీజీపీ కార్యాలయం, పోలీస్ కంట్రోల్ రూమ్ సహా నాలుగు దిక్కుల నుంచి మెరుపువేగంతో అసెంబ్లీవైపు దూసుకుపోయి.. మొదటి గేటు నుంచి లోనికి చొచ్చుకుపోయే ప్రయత్నం చేసి.. తొలి సవాలు విసిరారు. పోలీసులు చుట్టుముట్టినా.. తప్పించుకుని తెలంగాణ అమరవీరుల స్తూపం ఉన్న గన్‌పార్క్‌కు చేరుకున్నారు. నానా తంటాలు పడి వారిని అరెస్టు చేసిన పోలీసులకు.. ఇక సాయంత్రం వరకూ ఇదే పనిగా మారింది. ఒడిసిపట్టుకునే వీలులేకుండా.. పాదరసంలా కదిలే ఆందోళనకారులను అరెస్టు చేసి వ్యానుల్లో పడేయటం వారికి తలకు మించినభారంగా మారింది.

TRS-MP'S-ARREST-vinodఅసెంబ్లీ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే టీఆర్‌ఎస్ నేత, డాక్టర్స్ ఆఫ్ తెలంగాణ నాయకుడు డాక్టర్ నర్సయ్య నేతృత్వంలో దాదాపు వందమంది పోలీసుల కళ్లుగప్పి గన్‌పార్క్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి అసెంబ్లీ గేట్లను సమీపించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో నిరసనకారులు అక్కడికక్కడే ధర్నాకు దిగారు. వారిని అరెస్టు చేసి తరలించిన తర్వాత.. వారిని మించిన సంఖ్యలో మరో బృందం దూసుకొచ్చింది. దీంతో అసహనానికి గురైన పోలీసులు రెచ్చిపోయి.. ఆందోళనకారులను చితకబాదారు. వచ్చినవారిని వచ్చినట్లు వేటాడి పట్టుకుని.. వ్యానుల్లోకి విసిరేశారు. అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను కూడా అరెస్టు చేసేశామని విశ్రాంత స్థితిలో ఉన్న పోలీసులకు.. రాములమ్మ షాక్ ఇచ్చారు. తన అనుచరులతో కలిసి.. నేరుగా అసెంబ్లీలోని రెండో గేట్‌కు ఎంపీ విజయశాంతి చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. విజయశాంతి అరెస్టు సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

మరోవైపు టీఆర్‌ఎస్ ఎంపీలు జీ వివేక్, మందా జగన్నాథం, మాజీ ఎంపీ జితేందర్‌డ్డి సహా పలువురు నాయకులు అసెంబ్లీవైపు తరలివచ్చారు. వారిని నిజాం క్లబ్‌వద్ద పోలీసులు అరెస్టు చేశారు. తాము లోక్‌సభ సభ్యులమని, తమను అరెస్టు చేయాలంటే స్పీకర్ అనుమతి కావాలంటూ ఎంపీలు ప్రతిఘటించినా.. పట్టించుకోని పోలీసులు.. వారిని ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ పరిణామాలకు ముందు అసెంబ్లీలోనూ నిరసన జ్వాలలు అంటించిన టీఆర్‌ఎస్, సీపీఐ, బీజేపీ ఎమ్మెల్యేలు.. నిర్బంధకాండపై సర్కారును ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. జై తెలంగాణ అంటూ వారు చేసిన నినాదాలతో సభ దద్దరిల్లింది. అసెంబ్లీ ప్రాంగణంలో సర్కారు దిష్టిబొమ్మను దహనం చేసి.. దమనకాండను నిరసించారు.

అసెంబ్లీ గేటు వద్ద ఆందోళనకు దిగి.. అరెస్టయ్యారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంపైకి ఎక్కిన ఎమ్మెల్యేలు వినయభాస్కర్, కావేటి సమ్మయ్య నల్లజెండా ఎగరేసి.. ప్రభుత్వంపై ఆగ్రహాన్ని ప్రకటించారు. ఈ ఘటనతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. అటు ఇందిరాపార్క్, ఆశోక్‌నగర్ చౌరస్తా ప్రాంతాల్లో ఉద్యమకారులకు, పోలీసులకు నడుమ రణరంగమే జరిగింది. ఇందిరాపార్క్ వద్ద బాష్పవాయు గోళాలు వెదజల్లిన పొగలు.. ఆందోళనకారుల కళ్లను మండించాయి. ఉద్యమకారుల ఒంటిపై లాఠీలు విరిగాయి. బీహెచ్‌ఈఎల్ కార్మికుడు, తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థల జేఏసీ చైర్మన్ ఎల్లయ్య రెండు కాళ్లు విరిగిపోయాయి. టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు దారుణంగా ఈడ్చిపారేస్తే.. దేహం మెలితిరిగి ఆయన విలవిల్లాడిపోయారు.

shrarvan పోలీసుల అత్యుత్సాహానికి టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు దాసోజు శ్రవణ్ స్పృహతప్పారు. ఇక్కడే శ్రీనివాస్‌గౌడ్, కవిత, న్యూడెమోక్షికసీ నాయకులు పీ సూర్యం, కే గోవర్ధన్, పీవో డబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకురాలు విమలక్కను పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వీరి అరెస్టులు ముగిసిన తర్వాత చలో బాధ్యతను తెలంగాణ జర్నలిస్టు ఫోరం చేపట్టింది. ఫోరం అధ్యక్షుడు అల్లం నారాయణ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో తెలంగాణ పాత్రికేయులు ర్యాలీ నిర్వహించి, నినాదాలతో ఆ ప్రాంతాన్ని దద్దరిల్లించారు. వారినీ అరెస్టు చేసిన పోలీసులు.. గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తెలంగాణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చైర్మన్ మల్లికార్జున్ నాయకత్వంలో వందల సంఖ్యలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏజీ ఆఫీస్ నుంచి అసెంబ్లీ వైపు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డగించి అరెస్టు చేశారు. మొత్తంగా భద్రతా వలయాన్ని ధిక్కరించిన ఆందోళనకారులు.. దాదాపు 20వేల మంది భద్రతా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. అసెంబ్లీకి చేరుకోలేకపోయినవారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.