ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలె

తెలంగాణ బిల్లు ఎప్పుడు పెడ్తరంటే.. శీతాకాల సమావేశాల్లోనే పెడతారని ఆశిస్తున్నమని షిండే చెప్పిన్రు. రేపైనా.. ఎల్లుండైనా రాష్ట్రపతికి కేబినెట్ నోట్ వెళ్తుందని, అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లి పార్లమెంట్ కు రావాలని షిండే అన్నరు. ఈ ప్రాసెస్ ఎప్పటిలోగా అవుతుందో.. డిసెంబర్ 20వరకే శీతాకాల పార్లమెంట్ సమావేశాలున్నయి. ఒకవేళ 20లోపు తెలంగాణ బిల్లు రాకుంటే సమావేశాలను పొడిగించైనా బిల్లు పాస్ చేయించాలని తెలంగాణవాదులు డిమాండ్ చేస్తున్నరు. ప్లీజ్ ప్లీజ్ ఈ సమావేశాల్లోనే బిల్లు పాస్ చేయించండి..

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.