ఈ విజయం గుజరాతీలదే : మోడీ

అహ్మదాబాద్: తన విజయానికి కారణం ఆరుకోట్ల గుజరాతీలే అని సీఎం నరేంద్రమోడీ అన్నారు. ఇవాళ ఆయన అహ్మదాబాద్‌లో బీజేపీ విజయోత్సవ సభలో మాట్లాడారు. ఆరుకోట్ల గుజరాతీయులు తమకు ఏది కావాలో ఆలోచించి ఓటు ద్వారా తమ అభిప్రాయాని వెలిబుచ్చారని మోడీ వ్యాఖ్యానించారు. మళ్లీ అధికార పీఠాన్ని అందించిన వారందరికీ ఆయన పేరుపేరున ధన్యావాదాలు తెలిపారు. గుజరాత్ ప్రజల ఆలోచనా విధానంలో విప్లవాత్మకమైన మార్పు వచ్చింది. ప్రత్యర్థుల ప్రలోభాలకు ప్రజలు లొంగలేదని, కుల, మతాలకతీతంగా ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని హర్షం వ్యక్తం చేశారు. సమర్థ పాలన అందించే ప్రభుత్వానికి అండగా ఉంటామని ఈ ఫలితాలతో ప్రజలు తేల్చారని అన్నారు. అభివృద్ధి, పారదర్శకత, అవినీతి రహిత సమాజాన్ని ఈ విజయం ద్వారా ప్రజలు కాంక్షించారన్నారు. అభివృద్ధి ఫలాలు సామాన్యుడికి చేరేలా 11 ఏళ్లలో అనేక కఠిన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వ కఠిన నిర్ణయాలు కొందరికి బాధ కలిగించినా.. ప్రజా సంక్షేమం కోసం అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తెలియక ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే ఆరు కోట్ల గుజరాతీయులకు క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రజలే తన దేవుళ్లు అని, వారి ఆశీర్వాదంతో మరింత సుస్థిర, సమర్థ పాలన అందిస్తానని మోడీ చెప్పారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.