ఈ వారంలోనే తెలంగాణ బిల్లు : ఆజాద్,షిండే

ఢిల్లీ : తెలంగాణ బిల్లుపై సమావేశమైన జీవోఎం భేటీ ముగిసింది. జీవోఎంలో తీసుకున్న నిర్ణయాలను జీవోఎం సభ్యులు గులాంనబీ ఆజాద్, షిండే మీడియాకు వెల్లడించారు. ఈ వారంలోనే తెలంగాణ బిల్లు క్యాబినెట్ ముందుకు వెళుతుందని ఆజాద్ చెప్పారు. ఇప్పటివరకు జీవోఎం జరిపిన కసరత్తు ముగిసిందని ఆయన వివరించారు. ఇదే చివరి సమావేశమని, నివేదికలో కొన్ని సవరణలకు ఆమోదముద్ర వేశామని కేంద్రహోంమంత్రి షిండే చెప్పారు. త్వరలో నివేదికను కేబినెట్ ముందుకు పంపిస్తామన్నారు. ఆరగంటపాటు మాత్రమే జీవోఎం సమావేశం జరిగింది.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.