ఈ రాత్రికే ఓటింగ్ జరిగే అవకాశం

హైదరాబాద్: శాసన సభలో టీఆర్‌ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగిన అనంతరం ఇవాళ రాత్రికే అవిశ్వాసంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. తెలంగాణపై చర్చించేందుకు టీఆర్‌ఎస్ ప్రవేశ పెట్టిన అవిశ్వాసంపై చర్చించేందుకు స్పీకర్ ఎనిమిది గంటల సమయం ఇచ్చారు. దీంతో ఉదయం పదకొండున్నర గంటల నుంచి రాత్రి వరకు చర్చ జరిగి ఓటింగ్ జరిగనుంది. అయితే తాము ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ అనుమతిచ్చి వెంటనే చర్చ చేపట్టడంపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోన్నాయి. కాగా, అవిశ్వాసాన్ని పెండింగ్‌లో పెట్టి బడ్జెట్ ప్రవేశ పెట్టడం, దానిపై చర్చ కొనసాగించడం కష్టమని ప్రభుత్వం భావిస్తోంది.

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.