ఈశాన్య ఉగ్రవాదానికి కాంగ్రెస్సే కారణం

23ఏళ్లుగా అసోంనుంచి ప్రాతినిథ్యం వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ర్టానికి చేసిందేమీ లేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ విమర్శించారు. గువాహటి, ఇంఫాల్, చెన్నైలో శనివారం జరిగిన బహిరం గ సభల్లో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్‌పార్టీని, ప్రధానిని లక్ష్యంగా చేసుకుని విమర్శల జడివాన కురిపించారు. సుదీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించిన రాష్ర్టానికే ఏమీ చేయని ఒక వ్యక్తి దేశాన్ని ఏం ఉద్దరిస్తాడని మోడీ ప్రధానిపై విరుచుకుపడ్డారు.

bjprallyమీరు గత 23 ఏళ్లుగా ఆయనను రాజ్యసభకు పంపుతున్నారు. బదులుగా ఆయన ఏం చేశారు? మీకే ఏం చేయనివాడు దేశానికేం చేస్తాడు? అని ఆయన గువాహటిలో జరిగిన మహాగర్జన సమావేశం లో ప్రజలను ప్రశ్నించారు. మన్మోహన్ స్థానంలో ఒక సామా న్య కార్యకర్తకు ఇంత కా లం అవకాశం ఇచ్చినా ఈశాన్య రాష్ర్టాల ముఖచిత్రమే మారి ఉండేదని అన్నారు. ఈ విషయంలో మన్మోహన్ ప్రజలకు సంజాయిషీ చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈశాన్య రాష్ర్టాలను పూర్తిగా విస్మరించడం వల్లనే ఈ ఉగ్రవాదం తలెత్తిందని ఆరోపించారు. సరైన అభివద్ధి లేనందువల్లనే ఈ ప్రజలు జాతీయ స్రవంతిలో భాగస్వాములు కాలేకపోయారన్నారు. ఈశాన్యరాష్ర్టాల్లోకెల్లా అసోం పరిస్థితి దారుణంగా ఉందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే కష్టాలు గట్టెక్కుతాయన్నారు. అసోంతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తాను చిన్నతనంలో అసోం చాయ్‌నే అమ్మేవాడినని మోడీ చెప్పారు.

bjprally1వాజపేయి హయాంలో శ్రద్ధ: ఈశాన్య రాష్ర్టాల అభివద్ధిపై శ్రద్ధ వహించింది వాజపేయి మాత్రమేనని మోడీ చెప్పారు. ఎన్డీఏ హయాంలో వాజపేయి ఈశాన్య రాష్ర్టాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పరిచి అభివద్ధికి కషి చేశారని, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10శాతం బడ్జెట్ కేటాయించారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నేతలు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలోకి వచ్చినా అవినీతిలో కూరుకుపోవడం మినహా చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ నేతల ఆలోచనలు సంకుచితం..కలలు అల్పమైనవి.. భవిష్యత్ వ్యూహాలు దూరదష్టి కొరవడినవి అని మోడీ అన్నారు. యూపీఏ సర్కారుకు సరైన నేతకూడా లేడన్నారు. వారికి నేత లేడు..నీతి లేదు…నియత్ కూడా లేదు (న నేతా హై, న నీతీ హై, న నియత్ హై) అన్నారు.
నిడో మరణం దేశానికి సిగ్గుచేటు: ఢిల్లీలో అరుణాచల్ ప్రదేశ్ విద్యార్థి హత్య దేశానికి సిగ్గుచేటు అని మోడీ అన్నారు.

ఢిల్లీలో అసలు ప్రభుత్వం అంటూ ఒకటి లేకుండా పోయిందని, విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే క్రీడకు స్వస్తి చెప్పి నీడో కుటుంబానికి న్యాయం చేయాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు ఈశాన్య రాష్ర్టాల్లో మరింత అసంతప్తిని రాజేస్తాయని అన్నారు. తాము అధికారం చేపడితే ఔషధ మొక్కల పరిశ్రమలు, వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేస్తామన్నారు. కాగా, ఉగ్రవాద సంస్థల బహిష్కరణ పిలుపును లెక్క చేయకుండా మోడీ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. ర్యాలీకి కొద్ద గంటలు ముందు మణిపూర్‌లో ఉగ్రవాదులు బాంబులు తుపాకులతో జరిపిన దాడిలో భద్రతాసిబ్బందిలో ఒకరు మరణించారు. కాగా, ఆదివారం కేరళలోని కొచ్చిలో కొందరు చర్చి ప్రతినిధులతో నరేంద్రమోడీ సమావేశం కానున్నారు. అనంత రం కేరళ పులాయ మహాసభ లో ఆయన ప్రసంగిస్తారు.

గుజరాతీ ప్రజలకు అవమానం
చెన్నై: గుజరాతీ ప్రజలందరూ వెర్రివాళ్లు (ఉల్లూ) అం టూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అవమానిం చారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ శనివారం చెన్నైలో మం డిపడ్డారు. మూడు పర్యాయాలు అధికారంలోకి రానీయకుండా చేసినందుకు గుజరాతీలను.. వె ర్రివాళ్లు అని అనడం ఎంతవరకు సమంజసమని అన్నా రు. ఆర్థికమంత్రి చిదంబరంను విమర్శిస్తూ.. కష్టించి ప నిచేసేవారితో దేశానికి ఉపయోగం తప్ప, హార్వర్డ్ యూ నివర్సిటీలో చదివామని చెప్పుకునేవారితో ఎలాంటి ప్ర యోజనం ఉండదని అన్నారు. ఈ సందర్భంగా చిదం బరాన్ని రీకౌటింగ్ మంత్రి అని ఎద్దేవా చేశారు.

This entry was posted in NATIONAL NEWS.

Comments are closed.