ఈనెల 12న హైదరాబాద్ కు దిగ్విజయ్

ఈనెల 12న హైదరాబాద్‌కు వస్తున్నట్టు డిగ్గీ చెప్పారు. సొంత పార్టీ పార్లమెంట్ సభ్యులు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం బాధాకరంగా ఉందని దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. పలువురు సీమాంధ్ర ఎంపీలతో సంప్రదింపులు జరిపామని, నోటీసులు ఉపసంహరించుకుంటారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. జేసీ ఎలాంటి పరిస్థితుల్లో వ్యాఖ్యలు చేశారో తెలుసుకుంటున్నానని చెప్పారు. సీఎం కిరణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీఎం అధిష్ఠానాన్ని ధిక్కరిస్తున్నారని భావించడం లేదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చుపవని తెలిపారు.

This entry was posted in NATIONAL NEWS, Top Stories.

Comments are closed.