ఇవాళే సకలజనభేరీ.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటుదాం రండి

ఓ వైపు సీఎం కుట్రలు.. మరోవైపు పీసీసీ చీఫ్ నక్కజిత్తులు.. తెలంగాణ నోట్ పై  కేంద్రం మల్లగుల్లాలు.. ఇటు  చంద్రబాబు లాబీయింగ్.. జగన్ సమైక్య నాటకం..  ఇవన్నింటికీ ఒక్కటే విరుగుడు.. సీమాంధ్రుల సమైక్య కుట్రలను తిప్పికొట్టేందుకు తెలంగాణ జేఏసీ సందించిన అస్త్రం సకలజనభేరీ..

సకల జనభేరీతో తెలంగాణ ఆకాంక్షను మరోసారి ఢిల్లీకి చాటాలె.. ఉద్యమమే ఊపిరిగా బతికి.. తెలంగాణ కోసం ఉసురుతీసుకున్న విద్యార్థుల ఆత్మలను శాంతింపజేయాలి.. తెలంగాణ కోసం పరితపిస్తూ.. ఒంట్లో సత్తువ లేక.. నడిచే ఓపికలేక ఇంటిపట్టున మంచంపట్టిన ముసలోళ్ల మనసు నిమ్మలం చేయాలె.. నడవగలిగిన ప్రతి ఒక్కరు నిజాంకాలేజ్ గ్రౌండ్స్ కు తరలిరావాలె..  లేకపోతే ఒక చారిత్రక ఘట్టం మీ జీవితపేజీలోంచి మిస్సయినట్టే.. షిఫ్టుల్లో డ్యూటీ చేసేవాళ్లు మధ్యాహ్నం డ్యూటీ ఉంటే మార్నింగ్ రండి.. మార్నింగ్ డ్యూటీ ఉంటే మధ్యాహ్నం రండి.. నైట్ డ్యూటీ ఉంటే డే అంతా సభలోనే ఉండండి.. ఒక్కరోజు నిద్రపోకపోతే కొంపలంటుకపోవు.. ఇన్నాళ్లు తెలంగాణ కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపినం..  ఇవాళ పొద్దటి నుంచే గ్రౌండ్ లో తెలంగాణ సౌండ్ చేయాలె. జై తెలంగాణ నినాదాలు మార్మోగాలె..  తెలంగాణ తెచ్చుకునే సమయం వచ్చింది.. ఢిల్లీని శాసించడానికి సమరభేరి సభను వేదికగా మార్చుకుందాం..

అందరూ తప్పక రండి.. తెలంగాణ ఉద్యమంలో పాలుపంచుకోండి..  ఇప్పటికే సకలజనభేరీని సక్సెస్ చేయాలని కేసీఆర్, కోదండరాం, శ్రీనివాస్ గౌడ్, దేవిప్రసాద్, విఠల్  పిలుపునిచ్చిన్రు.

సకలజనభేరీలో తెలంగాణ సమరభేరీ మోగిద్దాం.. సమైక్యాంధ్రకు ఘోరీ కడదాం.. తెలంగాణ సత్తా చాటుదాం..   తెలంగాణ కోరుకునే వారంతా నిజాంకాలేజ్ గ్రౌండ్స్ కి రావాలని పోరుతెలంగాణ వేడుకుంటుంది.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.