ఇప్పుడు నంబర్ పేట్లు అవసరమా! -టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు

రాష్ట్రంలో కొత్త వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను ఏర్పాటుచేసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ హరీష్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన వేళ ప్రభుత్వానికి ఈ విషయంపై అంత ఆసక్తి ఎందుకని ఆయన ప్రశ్నించారు. బుధవారం సచివాలయంలో రవాణాశాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులను కలిసిన తదుపరి హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో సెక్యూరిటీ నెంబర్ ప్లేట్లను కొనుగోలు చేస్తే రేపు తెలంగాణ ఏర్పడిన తర్వాత మళ్ళీ వాటిని మార్చుకోవాల్సి వస్తుందని, దీని వల్ల వాహనదారులపై ఆర్ధిక భారం పడుతుందని తెలిపారు. హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ల టెండర్లను దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు లాభం చేకూర్చాలనే ఉద్దేశ్యంతోనే ప్రభుత్వం తొందరపాటుగా ఈ నిర్ణయం తీసుకుందని ఆయన ఆరోపించారు. వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు.

 

This entry was posted in TELANGANA NEWS.

Comments are closed.