విభజన ప్రకటన వెలువడిన తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించేందుకే ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేశామని దిగ్విజయ్ అన్నరు. ఈ కమిటీ ఎవరెవర్ని సంప్రదించాలో సీఎం, పీసీసీ చీఫ్లు నిర్ణయిస్తారని తెలిపిన్రు. ఆంటోనీ కమిటీకి విభజనకు సంబంధంలేదని మొన్న చెప్పిన డిగ్గీ ఇవాళ సంబంధం ఉందని అన్నరు. ఏం నాటకాలవి.. ఏం కతలు పడుతున్నరు. గురువారం కేబినెట్ తయారు చేస్తమన్నరు చెయ్యలేదు. ఇప్పుడు మళ్లీ చిరంజీవికి క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆంటోనీతో కమిటీ అంటున్నరు. మేం 60 సంవత్సరాలుగా పోరాటం చేస్తే స్పందించరు కానీ వాళ్లు నాలుగురోజులు టీవీల్లో షో చేస్తే కమిటీలంటరు. సంప్రదింపులంటరా..? అసలు మీరు తెలంగాణ ఇస్తరా.. ఇయ్యరా.. మీరియ్యపోతేనే మంచిది తియ్యి.. ఈ సారి ఉద్యమం వస్తే నినాదాలుండయి.. బగాయించుడే.. ఆపడం ఎవరితరం కాదు.