ఇదీ ఫజల్ అలీ గుర్తించిన తెలంగాణ రాష్ట్రం

తొలి ఎస్సార్సీయే గుర్తించాక.. మళ్లీ తెలంగాణపై ఎస్సార్సీ ఎందుకు?
మీరు చూస్తున్నది 1954లో రాష్ట్రాల పునర్విభజన సిఫారసులు చేసిన ఫజల్ అలీ కమిషన్ రూపొందించిన మ్యాప్. అప్పట్లోనే హైదరాబాద్ స్టేట్‌గా మనుగడలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఒక ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగించాలని పేర్కొంటూ ఫజల్ అలీ ఈ అరుదైన మ్యాప్‌లో పొందుపర్చారు.

తెలంగాణ సామాజిక, ఆర్థిక, భౌగోళిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకున్న ఎస్సార్సీ.. ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ స్టేట్‌గా కొనసాగించాలని ప్రతిపాదించింది. అంటే 1954లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాల్సింది. కానీ.. ఆంధ్రా నేతల లాబీయింగ్ ఫలితంగా ఆనాటి మన రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగలేక పోయింది. ఇప్పుడు దశాబ్దాల ఉద్యమాల అనంతరం, వేల బలిదానాల తర్వాత ప్రజల మనోభీష్టం నెరవేరుతున్నది. కానీ.. ఈ దశలోనూ తెలంగాణకు అడ్డంపడుతున్నవారు.. రెండో ఎస్సార్సీ వేస్తే తప్ప తెలంగాణ అంశాన్ని పరిష్కరించడం సాధ్యం కాదని వాదిస్తున్నవారు.. తొలి ఎస్సార్సీలోనే తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా గుర్తించిన ఫజల్ అలీ సిఫారసును ఎందుకు పట్టించుకోవడం లేదని తెలంగాణవాదులు నిలదీస్తున్నారు. తొలి ఎస్సార్సీలోనే తెలంగాణను గుర్తించగా.. ఇంకా రెండో ఎస్సార్సీ ఆవశ్యకత ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.