ఇది ప్రజావ్యతిరేక ప్రభుత్వం పడగొట్టి తీరుతాం

kcrrrr– ఎంట్రీ టాక్స్ విధించిన ఎన్టీఆర్
ఒక్క గుద్దుకు పోయారు
– మధ్యవూపదేశ్‌లో వ్యాట్‌ను వ్యతిరేకించిన కాంగ్రెస్
– ఆంధ్రవూపదేశ్‌లో ఎందుకు అమలు చేస్తోంది?
– టెక్స్‌టైల్స్ ఆందోళనలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని పడగొట్టితీరుతామని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. వస్త్రాలపై ప్రభుత్వం ‘వ్యాట్’ విధించినందుకు నిరసనగా ఏపీ ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన ధర్నాలో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారంటూ సీఎం కిరణ్‌పై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కిరణ్‌కు తెలివిలేదని ఎద్దేవా చేశారు. ‘కంట్ కోతల కారణంగా వ్యవసాయం దెబ్బతిన్నది. ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తున్నది. పరీక్షల కాలంలో కరెంట్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కరెంట్ చార్జీల పేరుతో రూ.32వేల కోట్ల భారం ప్రజల మీద వేసింది. వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధించింది’ అని ఆరోపించారు.

‘ప్రజలను పట్టించుకోని ఈ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో గల్లా పట్టుకొని.. ముక్కు పిండి నిలదీస్తాం. ప్రజా వ్యతిరేక విధానాలపై బ్రహ్మాండమైన యుద్ధం చేస్తాం. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి తీరుతాం’ అని కేసీఆర్ తేల్చి చెప్పారు.వ్యాట్ విషయంలో కాంగ్రెస్ రెండు నాల్కల ధోరణి, ద్వంద్వ నీతిని అవలంబిస్తున్నదని ఆరోపించారు. మధ్యవూపదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం వ్యాట్ విధిస్తే.. అక్కడి అసెంబ్లీలో వీర విహారం చేసి.. రద్దు చేసే వరకు విశ్రమించని కాంగ్రెస్, ఆంధ్రవూపదేశ్‌లో ఏవిధంగా వ్యాట్ విధిస్తున్నదని సూటిగా ప్రశ్నించారు. ‘కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది ఒక్క కాంగ్రెస్ పార్టీయే. అదే పార్టీ మధ్యవూపదేశ్‌కో నీతి, ఆంధ్రవూపదేశ్‌కో నీతి అవలంబిస్తోంది. ఇదెక్కడి నీతి?’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ మూర్ఖంగా వ్యవహరిస్తోందని, ఆ పార్టీ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకమని విమర్శించారు. వస్త్ర వ్యాపారులకు సాయం చేయని ప్రభుత్వం, వాళ్ల బతుకేదో వాళ్లను బతకనీయకుండా.. ఎందుకు నాశనం చేస్తున్నదని నిలదీశారు. వస్త్రవ్యాపారులు ఐదు రోజులుగా ఆందోళన చేస్తున్నా.. పట్టించుకోకుండా మీ చావు మీరు చావండని చూస్తున్నారా? అని సర్కారును ప్రశ్నించారు. ‘ఇది తానీషా రాజుల ప్రభుత్వమా? లేక ప్రజాస్వామ్యామా?’ అని ప్రశ్నించారు. ‘వీళ్లేం చేస్తారని అనుకుంటున్నావేమో.. కిరణ్! ఎందాకా ఉంటావు? ఎక్కడిదాకా ఉంటావు? ఈ గర్వం మంచిదికాదు. 1989లో అప్పటి సీఎం ఎన్టీఆర్ ంట్రీ టాక్స్ విధించారు. అప్పుడు ఒక్క గుద్దు గుద్దితే పాతాళానికి పోయిండు’ అని గుర్తు చేశారు. సీఎం తెలివితక్కువ, అవివేకం, అసమర్థ పాలన కారణంగా కరెంట్ సమస్య ఏర్పడిందన్నారు.

పారిక్షిశామిక వేత్తలు ధర్నాలు చేసినా పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో వస్త్ర వ్యాపారులపై వ్యాట్ విధించడం వల్ల పరిక్షిశమలు పక్క రాష్ట్రాలకు తరలిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తం ఆరు రాష్ట్రాల్లో వ్యాట్ విధించినా.. వాటిలో ఐదు రాష్ట్రాల సీఎం లు వెనక్కితగ్గారని, వారందరి కంటే ఈయనొక్కడికే తెలివి ఎక్కువుందా? అని ఎద్దేవా చేశారు. పదుల సంఖ్యలో ఉన్న మాల్స్‌ను చూపించి వస్త్రవ్యాపారంపై వ్యాట్ విధించి లక్షలమంది నోట్లో మట్టిపోసి, వారి జీవితాలతో ఆటలాడుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం పని చేయాల్సిన ఈ ప్రభుత్వం, వారి సమస్యలు పట్టించుకోకుండా.. గాడిద పండ్లు తోమడానికి ఉందా..? అని అపహాస్యం చేశారు. వస్త్రవ్యాపారులు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తున్నారని ప్రశంసించారు. వారు పాకిస్థాన్, అమెరికాకు చెందిన వారు కాదని, వారిని అమర్యాదగా చూడడం తగదని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇలాంటి సీఎం ఉండడం ఈ రాష్ట్రం చేసుకున్న ఖర్మ అని అన్నారు. ‘ముఖ్యమంవూతిని చూస్తే.. మంత్రులు దానం నాగేందర్, ముఖేశ్‌కు లాగు తడుస్తోంది. వారు ఏ ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు’ అని అన్నారు. ఇప్పటికైనా వారు సీఎంపై ఒత్తిడి తెచ్చి, వ్యాట్ రద్దు చేయించాలని సూచించారు. సీఎం మొండిగా వ్యవహరిస్తున్నందున పీసీసీ అధ్యక్షుడు బొత్య సత్యనారాయణ కలుగజేసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు. దిక్కుమాలిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

This entry was posted in ARTICLES, Top Stories.

Comments are closed.